ఆర్చరీ క్రీడాకారిణి మెడలోకి దిగిన బాణాన్ని ఎయిమ్స్ వైద్యులు తొలగించారు. దిబ్రఘఢ్‌లో ఖేలో ఇండియా యూత్ 2018 గ్రేమ్స్ లలో అర్చరీ శివాంగిణి గోయిన్ (12) అనే క్రీడాకారిణి ప్రాక్టీస్ చేస్తుండగా బాణం ఆమె మెడ వెనక భాగంలోకి దిగింది. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. రెండు గంటల పాటు ఎయిమ్స్ వైద్యులు కష్టపడి ఆమె దేహంలో నుంచి బాణాన్ని బయటకు తీశారు.
గతంలో ఓ అర్చర్‌కు బాణం తగిలి చనిపోయిన సంఘటనలు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. ఈ సర్జరీని డాక్టర్ రాజేశ్ మల్హోత్రా, డాక్టర్ శివనందా గమనాగట్టి, డాక్టర్ అమిత్ గుప్తా, దీపక్ గుప్తా, డాక్టర్ కొక్కుల ప్రణీత్ విజయవంతంగా నిర్వహించారు. ఆమె ఆరోగ్య పరస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వెన్నుపూసకు చిన్నపాటి గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు.