30.7 C
Hyderabad
April 29, 2024 05: 56 AM
Slider విజయనగరం

భోజనం పెడుతున్నారా..? పాఠాలు చెబుతున్నారా..? అర్ద‌మ‌వుతోందా..?

#collectorvijayanagaram

ఆమె ఓ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్..ఆక‌స్మాత్తుప‌ర్య‌ట‌న‌లు చే్యొచ్చు…ఉన్న‌ట్టుండీ త‌న కింది సిబ్బంది ప‌నితీరును ప‌రిశీలించ‌వ‌చ్చు.దాదాపు రెండున్న‌ర నెల‌ల క్రితం  జిల్లాకు  వ‌చ్చిన క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి ఆక‌స్మత్తుగా జిల్ల‌లోని గంట్యాడ మండంలో ప‌ర్య‌టించారు.నేరుగా మండ‌లంలోని మోడ‌ల్ స్కూల్ ను  ఆక‌స్మ‌కింగా త‌నిఖీ చేసారు.విద్యార్దుల‌ను కుశ‌ల ప్ర‌శ్న‌లు వేసారు…భోజ‌నం తింటున్నారా..?  పాఠాలు స‌రిగ్గా చెబుతున్నారా.? అంటూ విద్యార్దుల‌తో మాటామంతి క‌లిపారు.

అప్పటికే క‌లెక్ట‌ర్  తో వ‌చ్చిన సిబ్బందికి అర్ధ‌మై..త‌క్ష‌ణం మండ‌ల విద్యాశాఖ అధికారిని గంట్యాడ మోడ‌ల్ హైస్కూల్ కురావాల‌ని చెప్పి అలెర్ట్ చేసారు.సీన్ క‌ట్ చేస్తే…మండలంలోని పలు విద్యా సంస్థలు, కార్యాలయాల తనిఖీ  చేసారు..జిల్లా క‌లెక్ట‌ర్.  మోడల్ స్కూల్ సందర్శన, విద్యార్థులతో ముఖాముఖి నిర్వ‌హించారు నిర్మాణంలో ఉన్న రైతు భరోసా కేంద్రం పరిశీలించి…, త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసారు.

గ్రామ సచివాలయం తనిఖీ చేసి త‌ద్వారా, ప్రజలకు  అందుతున్న సేవలపై ఆరా తీసారు.  పెండింగ్ లో వున్న వినతుల గురించి, సకాలంలో వినతుల పరిష్కారం పై ఆదేశాలు ఇచ్చారు.అలాగే  రైతు భరోసా కేంద్రాన్ని సంద‌ర్శించి…స్థానిక‌ రైతులు, వ్యవసాయ అధికారులతో మాట్లాడారు. రైతుల సమస్యలు, ఎరువుల లభ్యత గురించి అడిగి తెలుసుకున్నారు…జిల్లా కలెక్టర్.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్

Related posts

షట్టర్ డౌన్: త్వరలో మూతపడిపోతున్న లక్ష్మీ విలాస్ బ్యాంకు

Satyam NEWS

జానపద గాయకుడు గిద్దె రామ నరసయ్యను పరామర్శించిన మంత్రి హరీష్

Bhavani

దేశంలో ఎక్కడ లేని విధంగా న్యాయవాదులకు ప్రభుత్వం హెల్త్ కార్డ్స్

Bhavani

Leave a Comment