37.7 C
Hyderabad
May 4, 2024 12: 49 PM
Slider సంపాదకీయం

సింగిల్ లైన్ ఆర్గ్యుమెంటు: ఎంత దూరం పారిపోతావు?

jagan 06

సింగిల్ లైన్ రోడ్డు ఉన్న అమరావతి రాజధానిగా ఎట్టిపరిస్థితుల్లో పనికి రాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నారు. సింగిల్ లైన్ రోడ్డు ఉంటే దాన్ని డబుల్ లైనూ, ఫోర్ లైనో చేసుకోవాలి కానీ దాని ఖర్మానికి దాన్ని వదిలేస్తారా? ఫోర్ లైన్ రోడ్డు ఉన్న చోటికి వెళ్లిపోతారా? ఇదేం లాజిక్కు?

రాజధాని మార్చడానికి ఇదా కారణం? ఎవరితోనైనా చెబితే నవ్విపోతారని కూడా చూడకుండా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బహిరంగ వేదికపై అదీ కూడా ది హిందూ పత్రిక నిర్వహించిన ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి హాజరై చెప్పారు. మేధావులు హాజరైన ఈ సభలో ఇంత సిల్లీ రీజన్ చెప్పి రాజధాని మార్పును సమర్ధించుకోవడం ఎంతవరకు సబబో ఆయనకే తెలియాలి. విశాఖ లో నాలుగు లైన్ల రోడ్డు ఇప్పుడు ఉన్నది.

 ఒకప్పుడు విశాఖపట్నం ఎలా ఉండేదో ముఖ్యమంత్రి జగన్ కు తెలుసా? ఓపెన్ డ్రైనేజీతో, ఇరుకు రోడ్లతో ఉండేది. జగదాంబ సెంటర్ ఒక్కటే ఉండేది. అప్పటిలో సీతమ్మధార వద్దకు వెళ్లిరావాలంటే ఒక రోజు మొత్తం పట్టేది. మరి ఇప్పుడు విశాఖ ఇంతలా లా అభివృద్ధి చెందింది? ఎవరో చేసిందే కదా?

ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడాన్ని సవాల్ గా తీసుకోవాలి. ఎవరో ఒకరు నడుంకట్టాలి. దానికి పరిస్థితులు సహకరించాలి. అప్పుడు ఏ నగరమైనా అభివృద్ధి చెందుతుంది. అంతే కానీ అమరావతికి రోడ్డు లేదు కాబట్టి విశాఖ పట్నం పోతున్నామని చెప్పడం అన్యాయం, దారుణం.

అసలైనా విశాఖపట్నం అభివృద్ధి ఒక్క రోజులో జరిగింది కాదు. అది నావీ బేస్ కావడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో క్రమ క్రమంగా అభివృద్ధి చెందింది. విశాఖ పట్నం ఇప్పటికే చాలా భారం మోస్తున్నది. అక్కడున్న పరిశ్రమలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు విశాఖకు ఊపిరి ఆడకుండా చేస్తున్నాయి.

ఇవే కాదు. అక్కడ మన దేశ నావీ బేస్ ఉంది. హైదరాబాద్ లో కంటోన్మెంట్ ప్రాంతంలో రోడ్డు వేసుకోవాలన్నా కేంద్ర ప్రభుత్వం చుట్టూ ఎన్ని సార్లు తిరగాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తెలంగాణ మునిసిపాలిటీ మంత్రి కేటీఆర్ ను అడిగితే చెబుతారు. అలాంటిది నావీ బేస్ ఉన్న ప్రాంతంలో మన ఇష్టం వచ్చిన రీతిలో విస్తరణ సాధ్యం అవుతుందా? విశాఖకు ఒక వైపు సముద్రం, మరో వైపు కొండలు ఉంటాయి.

ఆహ్లాదకరమైన పర్యాటక ప్రాంతాన్ని పర్యాటక రంగ హబ్ గా చేసుకోవాలి. ఎవరైనా సరే వైజాగ్ కు బీచ్ కోసం వెళతారు. అక్కడ నుంచి అరకు తదితర ప్రాంతాలు విహార యాత్ర కోసం వెళతారు. ఇప్పుడు రాజధాని పేరుతో అందరూ అటు పడితే అక్కడ పర్యాటక రంగం కూడా దెబ్బతింటుంది. చక్కని ప్రకృతి విధ్వంసం అవుతుంది. కొండలు తొలిచేసి కాలనీలు కట్టేసుకుంటారు. ఇప్పుడ కాకపోయినా ఆ తర్వాత అయినా.

హైదరాబాద్ శివారులలో 30 ఏళ్ల కిందట అన్నీ చిన్న చిన్న కొండలు (హిల్లక్స్)  ఉండేవి. ఇప్పుడు చూడండి ఎక్కడా హిల్లక్స్ లేవు. దాంతో వేసవి కాలంలో కూడా చల్లగా ఉండే హైదరాబాద్ ఇప్పుడు శీతా కాలంలో కూడా ఉక్కపోస్తున్నది. ఈ పరిస్థితి విశాఖ కు వచ్చేస్తుంది. అసలే అక్కడ సముద్ర తీరం కావడంతో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. పకృతికి హాని కలిగించే చర్యలు ప్రారంభిస్తే పెను ఉపద్రవం వస్తుంది. విశాఖపట్నం పర్యాటక కేంద్రంగా ఉన్నది.

అలానే ఉంచాలి. అప్పుడే విశాఖకు ప్రత్యేకత. ఆ ప్రత్యేకతను ఛిద్రం చేసి నాలుగు లైన్ల రోడ్లు ఉన్నాయి కదా అని అక్కడికి రాజధాని షిఫ్ట్ చేయడం అవివేకం. రాజధాని కట్టడానికి లక్ష కోట్ల రూపాయలు కావాలనేది మరో విచిత్రమైన వాదన. లక్ష కోట్లు ఎందుకు అవసరం అవుతాయి? ఐకానిక్ బిల్డింగుల పేరుతో చంద్రబాబు చేసినట్లు జిమ్మిక్కులు చేయాలంటే అవుతాయి.

అలా కాకుండా ఇప్పుడు ఉన్న భవనాలు అలాగే ఉంచినా ఎవరూ కాదనరు. ఇప్పుడు ఉన్న భవనాలు ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాయి. అటు విజయవాడా కాదు ఇటు గుంటూరు కాదు అని ముఖ్యమంత్రి మరో కామెంట్ చేశారు. విజయవాడ, గుంటూరులలో గజం స్థలం దొరుకుతుందా? అందుకే రెంటికి మధ్యలో రాజధాని నిర్మించారు. అక్కడ ల్యాండ్ అభివృద్ధి చేసుకోవాలి చేతైనతే.

నిన్నముఖ్యమంత్రి చెప్పిన మాటలను చూస్తే ఇక అమరావతిలో రోడ్లు కూడా వేయరన్నమాట. కమ్మోళ్లను ఆర్ధికంగా దెబ్బ తీయాలంటే తీసుకోండి. కమ్మోళ్లూ రెడ్డోళ్లూ తేల్చుకోవాలి కానీ రాష్ట్రం ఏమి చేసింది? రాష్ట్రానికి అన్యాయం చేయడం ఎందుకు? అయినా ఒక ప్రశ్న. విశాఖ పట్నంలో కమ్మోళ్లు లేరా? అక్కడున్న వ్యాపారాలలో చాలా భాగం కమ్మ కులస్తుల చేతుల్లోనే ఉన్నాయి. కమ్మ వారికి భయపడి దూరంగా పారిపోయి… ఎక్కడకు పారిపోతావు? కమ్మ సామాజిక వర్గం ప్రపంచంలోని అన్ని దేశాలలో అన్ని చోట్లా ఉంది.

Related posts

ఇంటింటి ప్రచారంలో భువన్ కుమార్ రెడ్డి బిజీ

Satyam NEWS

గాడ్ ఇన్ లాక్ డౌన్: ఒంటిమిట్ట లో రథోత్సవ పూజలు

Satyam NEWS

ఎరువుల ధరల పెంపుపై సీఎం కేసీఆర్ తీవ్ర నిరసన

Satyam NEWS

Leave a Comment