29.7 C
Hyderabad
May 6, 2024 05: 00 AM
Slider ముఖ్యంశాలు

సీతం కాలేజితో శాప్ డెవలపర్ అప్ సెల్యూట్ సంస్థ ఎంఒయు

#sitam college

విజయనగర పరిసర ప్రాంతాల్లోని విద్యార్ధుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికి తీసి వారి పురోభివృద్ధికి దోహదపడేందుకు అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు సత్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్ (సీతం) డైరక్టర్ మజ్జి శశిభూషణ రావు అన్నారు. తమ కళాశాల విద్యార్ధులకు ఇంటర్న్ షిప్ తోపాటు, ఉపాథి లభించేందుకు ఉపయుక్తంగా ఉండేలా మంగళగిరిలోని  అప్ సెల్యూట్ సాఫ్ట్ వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో సోమవారం నాడు సీతం సంస్థ ఎంఒయు కుదుర్చుకుంది.

ఈ సందర్భంగా శశిభూషణ రావు మాట్లాడుతూ ఐటి రంగంలో బహుళ జాతి సంస్థ, శాప్ డెవలపర్ గా గుర్తింపు పొందిన అప్ సెల్యూట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్ధులకు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అధునాతన శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడానికి అవకాశం లభిస్తుందన్నారు. విద్యార్ధుల్లోని ప్రతిభను వెలికి తీయడానికి, మెరుగులు దిద్దడానికి ఈ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. అప్ సెల్యూట్ సంస్థ విద్యార్దులకు ఇంటర్న్ షిప్ తోపాటు, ప్లేస్ మెంట్ ను కూడా కల్పిస్తుందన్నారు. దీని వల్ల తమ కళాశాలలోని సుమారు వెయ్యి మంది విద్యార్ధులకు మేలు చేకూరుతుందన్నారు.

ఎంఒయుపై సంతకం  చేసిన  అప్ సెల్యూట్ సంస్థ ఎగ్జుక్యూటివ్ డైరక్టర్ కల్పలత మాదాసు మాట్లాడుతూ  గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రోత్సహించడానికి వారి నైపుణ్యాన్ని పెంపొందించడానికి తాము తోడ్పాటును అందిస్తామని పేర్కొన్నారు. సీతం కు అన్ని రకాలుగా సహకరిస్తామని ఆమె తెలియజేసారు.

Related posts

విశాఖ,ఏలూరు రేంజ్ ప‌రిధిల‌లో ఆరుగురు సీఐల‌కు బ‌దిలీలు…!

Satyam NEWS

రాత్రి ఆ నేతతో సెటిల్మెంట్..పొద్దునే బోర్డు పికేసి ఎధేచ్ఛగా నిర్మాణం

Satyam NEWS

శాడ్: ఇంకో వారంలో పెళ్లి ఇంతలోనే మర్డర్

Satyam NEWS

Leave a Comment