27.7 C
Hyderabad
May 4, 2024 07: 22 AM
Slider కరీంనగర్

మంథని అడవుల్లో ఆరు పెద్ద పులులు

#ManthaniForest

పెద్దపల్లి జిల్లా ముత్తారం  మండలం మచ్చు పేట అడవుల్లో ఆరు పెద్ద పులుల సంచారం చేస్తున్నాయి. ఈ ఆరు పెద్ద పులులు ఒకే సారి పశువుల మందపై దాడి చేశాయి.

ఒక ఆవు అక్కడికక్కడే మృతి చెందినట్లు  ప్రత్యక్షసాక్షి పశువుల కాపరి  రాజయ్య తెలిపారు. ముత్తారం మండలంలోని మచ్చుపేట గ్రామానికి చెందిన కార్కూరి రాజయ్య ఆవుల మందను బహుళగుట్ట అడవిలోకి మేతకోసం తోలుకొని వెళ్లగా ఆరు పులులు అవులపై దాడి చేశాయి.

తాను అరుపులు వేయగా ఒక ఆవును చంపి పులులు పారిపోయాయని రాజయ్య తెలిపారు. పులులు ఆవుల మంద పై దాడి చేయడంతో రాజయ్య కేకలు విన్న చుట్టుపక్కల ఉన్న రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దాంతో ఎస్ఐ నరసింహారావు, అటవీ శాఖ అధికారులతో దాదాపు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలోకి వెళ్లి పరిశీలించారు. పులులు అటవీ లోనే ఉన్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు.

Related posts

రాజధాని మార్పు బిల్లును గవర్నర్ తిరస్కరించాలి

Satyam NEWS

విశాఖ ఉక్కును అమ్మే అధికారం ఈ ప్రభుత్వానికి లేదు

Satyam NEWS

బద్వేల్ ఉప ఎన్నికల్లో నేను పోటీ చెయ్యడం లేదు

Satyam NEWS

Leave a Comment