Slider ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు అవినీతి బట్టబయలు చేశాం

YSRCP-Anil_1060

పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతి బట్టబయలు అయిందని ఏపి ఇరిగేషన్‌ శాఖమంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ వెల్లడించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పోలవరం పనుల రివర్స్‌ టెండరింగ్‌ లో చంద్రబాబు అక్రమాలు నిర్ధారణ అయ్యాయని ఆయన తెలిపారు. రివర్స్‌ టెండరింగ్‌ తో ప్రభుత్వానికి 50 కోట్ల ఆదా అయిందని కేవలం 300 కోట్ల టెండర్లలో 50 కోట్లు మిగిల్చాం అని ఆయన తెలిపారు. తమ అవినీతి బయటపడుతుందనే భయంతో రివర్స్‌ టెండరింగ్‌ పై తెలుగుదేశం పార్టీ అసత్యప్రచారం చేస్తోందని మంత్రి అన్నారు. చంద్రబాబు గతంలో ఇవేపనులను 4.77 శాతం ఎక్కువకు టెండర్‌ ఇచ్చారని, తాము అదే సంస్ద(మ్యాక్స్‌ ఇన్‌ ఫ్రా)కు 15.6 శాతం లెస్‌ కు టెండర్‌ ఇచ్చామని ఆయన తెలిపారు. అంటే ఇందులో అవినీతి జరిగినట్లుగా నిర్ధారణ అయినట్లేనని ఆయన అన్నారు. అందుకోసమే గత ప్రభుత్వం చేపట్టిన ప్రతిపనికి రివర్స్‌ టెండరింగ్‌ కు వెళ్తాం అని ఆయన ప్రకటించారు. చంద్రబాబు అనుకూలమైన మీడియాకు చెబుతున్నాం అసత్యప్రచారాలు మానుకోవాలని అని మంత్రి హెచ్చరించారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి అన్నారు.

Related posts

ముఖ్యమంత్రితో విభేదాలూ లేవు: చినజీయర్​ స్వామి

Satyam NEWS

బ్రాహ్మణులకు నిత్యావసరాలు ఇచ్చిన గాయత్రి సొసైటీ

Satyam NEWS

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి ఫ్ఫ్యాప్టో సమాయత్తం

Satyam NEWS

Leave a Comment