30.7 C
Hyderabad
April 29, 2024 03: 22 AM
Slider మహబూబ్ నగర్

అమ్మాయిలూ మీకు భరోసాగా షీ టీమ్స్ ఉన్నాయి

#residential schools

ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ ,యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, Q R Code, షీ టీం లపై విద్యార్థిని విద్యార్థులకు నేడు నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈరోజు తెలకపల్లి లోని సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల లో షీ టీం అవగాహన సదస్సు లో ముఖ్య అతిధి జిల్లా అడిషనల్ ఎస్ పి సి హెచ్ రామేశ్వర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న షీ టీం బృందం ప్రభుత్వ కళాశాలలో, పాఠశాలల్లో, తెలంగాణ మోడల్ స్కూల్ లలో, రెసిడెన్షియల్ స్కూల్, కేజీబీవీ స్కూళ్లలో అవగాహనాకార్యక్రమాలు నిర్వహిస్తున్నదని తెలిపారు. ఎలాంటి వేధింపులకైనా గురి అవుతున్న బాలికలైనా, మహిళలైనా షీ టీమ్స్ ను వినియోగించుకోవాలని ఆయన కోరారు. వారు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని, మహిళలు బాలికలు నిర్భయంగా ముందుకు రండి వేధింపుల

నుండి బయటపడండి అని ఆయన పిలుపునిచ్చారు. ఫిర్యాది వివరాలు గోప్యంగా ఉంచబడతాయి షీ టీం వాట్సాప్ నంబర్ 8712657676 లేదా డయల్ 100 కు ఫోన్ చేసి సహాయం పొందగలరు అని అన్నారు. షీ టీమ్ ఇంచార్జ్ విజయలక్ష్మి మాట్లాడుతూ అమ్మాయిలు ఈ స్కూల్లో సేఫ్ గా ఉన్నప్పటికీ సెలవులప్పుడు ఊరికి వెళ్లిన క్రమంలో మగవారి ద్వారా వేధింపులకు గురి అయితే వెంటనే సిపిఎం నెంబర్ కు ఫోన్ చేయవచ్చునని తెలిపారు.

ఇలా చేయడం ద్వారా సమస్యను అధిగమించవచ్చునని అన్నారు. సమాజంలో అన్ని వయసుల బాలికలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి అందువల్ల మీరంతా అప్రమత్తంగా ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సపాల్ సాయి లత, ఉపాధ్యాయురాళ్లు, షీ టీం మెంబర్ వెంకటయ్య సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ నారాయణ ఊసన్న లు పాల్గొన్నారు.

Related posts

Vijayanagaram Police: ఒకేసారి 20 మంది ఎస్ఐ లకు స్థానచలనం

Satyam NEWS

మే లో మండుద్ధి: ఏప్రిల్ నుంచే వడగాలులు

Sub Editor 2

వైఎస్ విజయలక్ష్మితో మంత్రి రోజా భేటీ

Satyam NEWS

Leave a Comment