37.7 C
Hyderabad
May 4, 2024 13: 37 PM
Slider ముఖ్యంశాలు

చిన్న పత్రికలకు జీవం పోయండి

#bhatti

ఏళ్ళతరబడి పెండింగ్ లో ఉన్న చిన్న పత్రికల సమస్యల సమహారాన్ని  రాష్ట్ర రెవిన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తెలంగాణ చిన్న మధ్య తరహా పత్రికల మ్యాగజైన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దాస్ మాతంగి, గౌరవ అధ్యక్షులు కోటగిరి దైవాదీనo, ప్రధాన కార్యదర్శి షేక్ అహమ్మద్ అలీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు  యాదయ్య, రాష్ట్ర ప్రచార కార్యదర్శి కొమరాజు శ్రీనివాసులు, వేమిరెడ్డి సుభాష్ రెడ్డి బృందం తమ గోడుగా కూడిన వినతి పత్రాన్ని అందించింది.

చిన్న మధ్య తరహా పత్రికలకు విడుదల చేసిన ప్రకటనల బిల్లులు ఏడాదిన్నర కాలంగా ఆర్థిక శాఖలో పెండింగ్ లో ఉన్నాయని, ఆయా బిల్లులను వెంటనే  విడుదల చేసి చిన్న పత్రికల మనుగడకు ఊపిరి ఊదాలని కోరారు. ఆరేళ్లు 2018నుంచి అఫ్ గ్రేడ్ ప్రక్రియ కోసం ఎదురు చూస్తున్నామని, గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల మేరకు చిన్న మధ్య తరహా పత్రికల అఫ్ గ్రేడ్ ప్రక్రియ తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు.

కరోనా విపత్కర పరిస్థితుల్లో అడహక్ బేసిక్ లో 2020 లో కొన్ని పత్రికలకు ఎంపానల్ మెంట్ జరిగిందని, పూర్తి స్థాయి ఎంపానల్ మెంట్ చేపట్టి, మూడేళ్లుగా నీరీక్షిస్తున్న ఆయా పత్రికలను ఎంపానల్ మెంట్ చేసి ఆదుకోవాలన్నారు. ఐ అండ్ పి ఆర్ కమీషనర్ ఉత్తర్వుల మేరకు ప్రతి నెల 25 రోజుల అటెండెన్స్ ను పరిగణనలోకి తీసుకుని యాడ్ లు ఇస్తున్నప్పటికి వాటికి తోడు మునుపటి మాదిరిగా క్లాసిఫైడ్, ఎల్ ఏ యాడ్ లు ఇవ్వాలని, మ్యాగజైన్స్ కూడా ప్రతినెల యాడ్ లు ఇవ్వాలని మంత్రి దృష్టికి తెచ్చారు.

ఐఅండ్ పిఆర్ కమీషనర్ అక్రిడిటేశన్ కార్డులు కల్గిన దిన పత్రికల ఎడిటర్లకు హైదారాబాద్ లో, మ్యాగజైన్స్ ఆయా జిల్లాలో ఇళ్ళ స్థలాలిచ్చి జర్నలిస్టులందరికీ గూడు కల్పించాలని విన్నవించారు. ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఐఅండ్ పిఆర్ స్పెషల్ కమీషనర్ ఆదేశించారు. అనంతరం ఐఅండ్ పిఆర్ స్పెషల్ కమీషనర్ అశోక్ రెడ్డిని కలసి వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రతి నెల రెగ్యులర్ గా ఇచ్చే యాడ్ లను పునరుద్ధరించాలని కోరారు.

బిల్లులు విడుదలకై భట్టికి వినతి

ఆర్థిక శాఖలో పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర డిప్యూటి సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు కు వినతి పత్రాన్ని అందించింది. ఏడాదిన్నర కాలంగా ఆర్థిక శాఖలో చిన్న పత్రికల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, తక్షణమే విడుదల చేసి చిన్న పత్రికల జీవం పోయాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో సంఘం  నల్గొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోటగిరి చంద్రశేఖర్, ఎండి మక్సుద్, వీరెల్లి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

సగం తిక్క దిగిన రామ్ గోపాల్ వర్మ

Satyam NEWS

కాకినాడ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా రామారావు

Bhavani

పోలీస్ సర్కిల్ ఆఫీసును  తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Satyam NEWS

Leave a Comment