40.2 C
Hyderabad
May 5, 2024 18: 43 PM
Slider ప్రత్యేకం

పల్లెల్లో మంచు దుప్పటి …

#Snow blanket

చలి మంచు కురిసింది తలుపు తీయవా ప్రభూ… అంటూ జాలువారే ఆ తీయని గానం ఘనీభవించేలా గురువారం మంచు కమ్మేసింది. పూజలు అందుకునే ప్రభువు పార్దించాలనుకునే భక్తులు ఆ మంచు తెరలు చూసి తలుపులు మూసుకునే అంత దట్టంగా ఈ మంచు ఆవరించింది. పక్క మనిషిని గుర్తుపట్టేలా కనిపించనంతగా మంచు దుప్పటితో ముసిగేసంది.

ముసుగుతన్నిన దుప్పటిని తప్పించుకునేందుకు సూర్యుడుకి చాలా సేపే పట్టింది. ఉదయం ఎనిమిది గంటల వరకు మంచు కంబలి రవి బింబాన్ని గట్టిగానే పట్టి ఉంచింది.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పాడేరు వంటే ఏజెన్సీ ప్రాంతంలో మాదిరిగా ఈ మంచు కురుస్తూనే ఉంది. తెల్లారింది మొదలు జీవనం సాగించడానికి ప్రయాసల పడే వారంతా ఏ మంచు పొరలను తప్పించుకుని వెళ్లడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది.నాలుగు లైన్ల జాతీయ రహదారిపై మూడంకెల వేగంతో రయ్‌న దూసుకుపోయే వాహనాలు ఈ పొగ మంచు వల్ల పది కిలోమీటర్ల వేగానికి పరిమితం కావలసి వచ్చింది.

తెల్లారినప్పటికీ లైట్ల వెలుతురులోనే నెమ్మదిగా వాహనాలు కదిలాయి. మరికొన్ని వాహనాలను ఈ మంచుకి ప్రమాదాల భయంతో రోడ్డు పక్కన నిలిపేసారు.

ప్రకృతి అందాలు ఈ మంచుకి అద్భుతంగా కనిపించాయి. ఆ దృశ్యాలను చిత్రీకరించడానికి సెల్ పోన్లకు యువకులు పనిచెప్పారు.

Related posts

మద్యం అధిక ధరలకు అమ్మితే ఫిర్యాదు చేయండి

Satyam NEWS

అత్తా కోడళ్ల చేనేత వస్త్రాల షాపింగ్ సందడి

Satyam NEWS

గరుడ వారధి ఫ్లై ఓవర్  బ్రిడ్జ్ లో పగుళ్లకు కారణాలేమిటి?

Satyam NEWS

Leave a Comment