29.7 C
Hyderabad
May 4, 2024 06: 03 AM
Slider హైదరాబాద్

హోరెత్తిస్తున్నసోష‌ల్ మీడియా

social-media-1

ఈ నేప‌థ్యంలో అధికార టీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ ఇత‌ర పార్టీలు సోష‌ల్ మీడియాను న‌మ్ముకొని నిజాలు కొద్దిగా ఉంటే, అబ‌ద్దాలు ఎక్కువ‌గా ప్ర‌సార‌మ‌య్యే సోష‌ల్ మీడియాను న‌మ్ముకున్నాయ‌నే చెప్పొచ్చు. కాగా సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌పై నిజానిజాలు తెలుసుకోవ‌డానికి స‌మ‌యం ప‌ట్ట‌నుండ‌డంతో అంత‌లో పార్టీల‌కు జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల వాద‌న‌.

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్వీట్ట‌ర్ లాంటివే కాకుండా స్థానికంగా ఉండే ఆయా పార్టీల సోష‌ల్ మీడియా అభ్య‌ర్థులు గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో కీల‌క పాత్ర వ‌హించ‌నున్నార‌నే చెప్పుకోవాలి. ఇప్ప‌టికే ఈ దిశ‌గా పూర్తిగా స‌మావేశ‌మై గ‌త రెండు రోజుల నుంచి మెస్సేజ్‌లు, వార్త‌లు, ఫోటోలు త‌దిత‌రాల‌తో త‌మ త‌మ పార్టీల వీరాభిమానాన్ని ప్ర‌జ‌ల‌పై (ఓట‌ర్ల‌పై) రుద్దేందుకు సోష‌ల్ మీడియా రంగంలోకి దిగింది.

ఈ నేప‌థ్యంలో ఓట‌రు ఎవ‌రివైపు మొగ్గుచూపుతాడో అనే, ఫ‌లితాలు కూడా తారుమార‌య్యే ప్ర‌మాదం ఉంది. సోష‌ల్ మీడియా ప్ర‌చారాన్ని కాకుండా స్థానిక అభ్య‌ర్థుల బాగోగుల‌ను, ప‌నితీరును స‌మీక్షించుకొని ఓట‌ర్లు ఆలోచించి ఓటు వేస్తేనే స‌రైన అభ్య‌ర్థిని గెలిపించుకొనే అవ‌కాశం ఉంద‌ని అనుభ‌వ‌జ్ఞులు పేర్కొంటున్నారు.


మ‌రి ఇక ప్ర‌జ‌లు సోష‌ల్ మీడియా ప్ర‌చారాన్ని న‌మ్మి త‌మ ఓటును వేస్తారో? లేక వారి విజ్ఞ‌త‌తో ఓటేస్తారో నిర్ణ‌యించుకోవాల్సిందే ప్ర‌జ‌లే.

Related posts

రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించిన బోథ్ ఎమ్మెల్యే

Satyam NEWS

చిరంజీవిపై మండిపడుతున్న పవర్ స్టార్ అభిమానులు

Satyam NEWS

సిరిమానోత్సవానికి మూడంచెల పోలీసు భద్రత: ఎస్పీ దీపిక

Satyam NEWS

Leave a Comment