26.7 C
Hyderabad
May 3, 2024 08: 15 AM
Slider కడప

హనుమంత వాహనం పై శ్రీ కోదండరామ స్వామిగా సౌమ్యనాధ స్వామి

#sowmyanathaswamy

అన్నమయ్య జిల్లా నందలూరు లోని నారదమునిచే ప్రతిష్ఠింపబడి శ్రీ తాళ్ళపాక  అన్నమయ్య చే  పూజలందుకున్న  శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాధ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం ఐదో రోజు రాత్రి హనుమంత వాహనం పై శ్రీ కోదండ రామస్వామి గా మాడ వీధుల్లో విహారించారు.

తొలి ఏకాదశి కావడంతో మూల విరాట్ కు విశేష పూజలు నిర్వహించారు.భక్తులు క్యూ లైన్ లో బారులు తీరి దర్శించు కున్నారు.ఆలయ యాగశాలలో హోమం లఘు పూర్ణాహుతి పూజలనంతరం ఈ గ్రామోత్సవం  నిర్వహించారు. స్వామివారిని వివిధ రకాలపూలతో పట్టు వస్త్రాలతో స్వర్ణాభరణాలతో నేత్రపర్వంగా అలంకరించారు. మంగళ వాయిద్యాల నడుమ,భక్తుల గోవిందనామాల మధ్య ఈ గ్రామోత్సవ జరుగగా  పెద్ద సంఖ్యలో భక్తులు నారికేళం,పండ్లు సమర్పించారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ అన్నమాచార్య కీర్తనలకు చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శన భక్తులను అక్కట్టు కున్నాయి.ఈ కార్యక్రమంలో ఆలయ బ్రహ్మోత్సవ కమిటీ  గౌరవాధ్యక్షులు మేడా విజయ భాస్కర్ రెడ్డి, సమన్వయ కర్త మేడా విజయ శేఖర్ రెడ్డి,ఆలయ చైర్మన్ అరిగెల సౌమిత్రి చంద్రనాథ్,ఈవో కొండారెడ్డి, శేషారెడ్డి, ఆలయ అర్చకులు సునీల్ శర్మ, బాల సుబ్రమణ్యం స్వామి తదితరులు పాల్గొన్నారు.

Related posts

సర్పంచ్ లకు కుచ్చుటోపీ పెట్టిన జగన్ ప్రభుత్వం

Satyam NEWS

మైదుకూరు మున్సిపాలిటీలో మాయ చేసిన వైసీపీ

Satyam NEWS

మేఘన బేకరీని ప్రారంభించిన ములుగు ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment