27.7 C
Hyderabad
May 4, 2024 10: 42 AM
Slider విజయనగరం

స్పందన ఫిర్యాదులను వారం రోజుల్లో పరిష్కరించాలి

#vijayanagaram police

ప్రతీ వారం మాదిరిగా నే విజయనగరం జిల్లాలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ దీపికా పాటిల్…స్పందన కార్యక్రమం నిర్వహించింది. ఇందులో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. బాధితుల నుంచీ ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో ఫోనులో మాట్లాడి, పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులను న్యాయం చేయాలని ఆదేశించారు.

“స్పందన” కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీగారు 35 ఫిర్యాదులను స్వీకరించి, ఇచ్చిన ఫిర్యాదులకు రశీదులను అందజేసి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. విజయనగరం మండలం కోరుకొండకు చెందిన నరసింగరావు అనే వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తాను పిపి రేగ మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన పోతయ్య ఆర్మీలో కలసి పని చేసి, రిటైర్ అయ్యామని, ఇరువురం కలిసి డబ్బులు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసామని, వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని, న్యాయం చేయాలని కోరారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ జరిపి, చట్ట పరిధిలో ఫిర్యాదికి న్యాయం చేయాలని పూసపాటిరేగ ఎస్ ఐను ఆదేశించారు. పెందుర్తి మండలం సుజాతనగర్ కు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి జిల్లా ఎస్పీ ఫిర్యాదు చేస్తూ తన తండ్రికి ఇద్దరు కుమారులమని, ఉద్యోగరీత్యా తాను స్వంత గ్రామానికి దూరంగా ఉన్నట్లు, తన తండ్రి ద్వారా సంక్రమించాల్సిన ఇల్లు, ఆస్తి, బంగారం, వెండి వస్తువులను జామిలో ఉంటున్న తన సోదరుడు మూర్తి బలవంతంగా తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాడని, తనకు న్యాయం చేయాల్సిందిగా కోరారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ ఇరువురిని పిలిపించి కౌన్సిలింగు నిర్వహించాలని ఎస్. కోట సీఐను ఆదేశించారు. మక్కువ మండలం కవిరివలసకు చెందిన వెంకటి అనే వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ లక్ష్మి అనే ఆమె నర్సు, ఆఫీసు సబార్డినేట్ ఉద్యోగాలు కల్పిస్తామని తమను నమ్మించి, రూ. 12.50 లక్షలను అడ్వన్సుగా తీసుకొనినట్లు, తాము పదే పదే అడుగగా తిరిగి 4 లక్షలు ఇచ్చి వేసినట్లు, ఇంకనూ రూ. 8.50 లక్షలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందని, న్యాయం చేయాలని కోరారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని సాలూరు సీఐను ఆదేశించారు. ఖమ్మంకు చెందిన జ్యోతి అనే ఆమె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తనను అప్పలరాజు, కృష్ణవేణి అనే దంపతులు దత్తత తీసుకొని, తనకు వివాహం చేసారని, తన తల్లి అనారోగ్య కారణాలతో 2020లో చనిపోగా, తన తండ్రి కరోనాతో 2021లో చనిపోయారని, కరోనా కారణంగా తాను విజయనగరం సకాలంలో రాకలేక పోయానని, ఈ విషయాన్ని ఆసరాగా తీసుకొని తన దత్తత తండ్రి తమ్ముడు కుమారుడు ఇంటిలోగల ఇంటి కాగితాలు, బంగారం, వెండి ఆభరణాలను తీసుకొని వెళ్ళిపోయాడని, ఇప్పుడు తనను దత్తత తండ్రి సంపాదించిన ఇంటిలోకి రాకుండా అడ్డుకుంటున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నాడని, న్యాయం చేయాలని కోరారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన ఇజల్లా ఎస్పీ విచారణ జరిపి, చట్ట పరిధిలో న్యాయం చేయాలని విజయనగరం 2వ పట్టణ సీఐను ఆదేశించారు. విజయనగరం కొత్త పేటకు చెందిన రేవతి అనే ఆమె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తనను భర్త మురళీధర్ ఇతర బంధువులు అదనంగా కట్నం తీసుకొని రమ్మనమని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ జరిపి, ఫిర్యాదికి చట్ట పరిధిలో న్యాయం చేయాలని దిశా మహిళా పిఎస్ డిఎస్పీని ఆదేశించారు. విజయనగరం  దుప్పాడ గ్రామానికి చెందన దేవి అనే ఆమె జిల్లా ఎస్పీగార్కి ఫిర్యాదు చేస్తూ తన తండ్రి మెంటాడ మండలం జయితి గ్రామంలో తన పేరున 0. 65 సెంట్లు భూమిని వ్రాసారని, ఇప్పుడు తన అన్నదమ్ములు తమను వ్యవసాయం చేసుకోకుండా అడ్డుకుంటున్నారని, న్యాయం చేయాలని కోరారు.

ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ జరిపి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని గజపతినగరం సిఐను ఆదేశించారు.స్వీకరించిన ఫిర్యాదుల పై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, 7దినాల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదుల పై తీసుకున్న చర్యలను తనకు వెంటనే నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ దీపికా ఎం పాటిల్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో దిశా మహిళా పిఎస్ డిఎస్పీ టి.త్రినాధ్, డిసిఆర్ బి సిఐ బి. వెంకటరావు, ఎస్బీ సిఐ జి. రాంబాబు, ఎస్ ఐలు నీలకంఠం, అప్పారావు, విక్రమరావు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

అల్లా దయవల్ల రంజాన్ లో అందరూ బాగుండాలి

Satyam NEWS

ప్రముఖ నిర్మాత మురారి కన్నుమూత

Satyam NEWS

ప్రాణాలు తోడేస్తున్న అనధికార చిట్ ఫండ్లు

Bhavani

Leave a Comment