28.7 C
Hyderabad
April 28, 2024 05: 29 AM
Slider ముఖ్యంశాలు

పారదర్శకతకు పాతర: జీవోలు ఇకపై ఆన్ లైన్ లో ఉండవు

#CM Jagan

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అసాధారణ నిర్ణయం తీసుకున్నది. పారదర్శకత అనే అంశాన్ని పక్కన పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తున్నది.

ప్రభుత్వ ఉత్తర్వులను ఇకపై ఆన్‌లైన్‌లో ఉంచకూడదని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు సమాచారం అందించింది.

ఇకపై ఆఫ్‌లైన్‌లో మాత్రమే ప్రభుత్వ ఉత్తర్వులు ఉంటాయని స్పష్టం చేసింది. ఇటీవల బ్లాంక్‌ జీవోల జారీ వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

పొరుగు రాష్ట్రాల విధానాలను అనుసరించాలని నిర్ణయించింది. 2008లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆన్‌లైన్‌లో జీవోలను ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు.

ఆయన కుమారుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవోలను ఆన్ లైన్ లో ఉంచరాదని నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Related posts

6 గ్యారెంటీలు అమలు చేస్తాం

Satyam NEWS

అధికారుల వైఖరిపై కరెంటు స్తంభం ఎక్కి నిరసన

Satyam NEWS

జగన్ సభలో వృద్ధురాలి కాలు నుజ్జునుజ్జు

Bhavani

Leave a Comment