38.2 C
Hyderabad
April 29, 2024 11: 03 AM
Slider ప్రత్యేకం

Protest: మీడియాను బయటకు తోసిన కల్వకుర్తి ఎస్ ఐ

#kalwakurthySI

ఉద్యోగాల భర్తీపై ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్, NSUI చేసిన ధర్నా సందర్భంగా పోలీసుల ప్రవర్తనపై పలు విమర్శలు చెలరేగుతున్నాయి. కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు యూత్ కాంగ్రెస్, NSUI ధర్నా చేశారు. అనంతరం గోడలు దూకి కార్యాలయంలో కి దూసుకెళ్లారు. వారిని పోలీసులు అరెస్టు చేయడంతో ఆ మొత్తం సంఘటనను కవర్ చేసేందుకు స్థానిక విలేకరులు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు.

అక్కడ ఉన్న కల్వకుర్తి రెండవ ఎస్ఐ భాస్కర్ విలేకరుల పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించారు. విలేకరులని తెలిసి కూడా తెలియనట్లు నటిస్తూ అవమానాల పాలు చేశారు. నా పోలీస్ స్టేషన్ లోకి మీరు ఎలా వస్తారు బయటికి వెళ్ళండి అంటూ  మీడియా వారిని  పోలీస్ స్టేషన్ నుండి బయటకు తోశాడు. పక్కనున్న పోలీసులు వారంతా మీడియా వారని చెబుతున్నా కూడా కల్వకుర్తి రెండవ ఎస్ఐ భాస్కర్ మీడియా వారిని బలవంతంగా బయటకు గెంటి వేశాడు. ఎస్సై ప్రవర్తనపై జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Related posts

ప్రేమామృతం

Satyam NEWS

“హలో హాలీవుడ్” అంటున్న తెలుగుతేజం “రాజ్ దాసిరెడ్డి”

Satyam NEWS

బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో అపచారం

Satyam NEWS

Leave a Comment