39.2 C
Hyderabad
May 4, 2024 22: 40 PM
Slider విజయనగరం

జిల్లా “స్పంద‌న “లో బాదితులు వెర్స‌స్ అధికారులు…!

#spandana

విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌రేట్  లో 26 వ  తేదీన‌ జ‌రిగిన‌ స్పంద‌న‌లో ఓ ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది. అదీ జిల్లా క‌లెక్ట‌ర్, ఫ‌స్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ లేకుండా విష‌యంలోకి  వెళితే విజ‌య‌న‌గ‌రంలో  కంటోన్మెంట్ బొగ్గుల దిబ్బ‌లో ఓ వాట‌ర్ ట్యాంక్ నిర్మాణం అవుతోంది. ఆ వాట‌ర్ ట్యాంక్ నిర్మాణం.. అక్క‌డి స్థానికుల  ఇండ్ల‌ను కూల్చి క‌ట్టార‌ని… బాదితులు త‌రుపున ప‌ట్ట‌ణ పౌర సంక్షేమ సంఘం ఎప్ప‌టి నుంచో గొంతెత్తి అరుస్తోంది.

కాగా అధికార పార్టీ కి చెందిన స్థానిక కార్పొర‌ట‌ర్ అండ‌,ధైర్యంతో ఓ నిమ్న జాతి కులానికి చెందిన ఓ వ్య‌క్తి..ఆ కార్పొరేట‌ర్ భ‌ర్త కావ‌డంతో…ఆ వాట‌ర్ ప్లాంట్ నిర్మాణంకు వ‌త్తాసు ప‌లుకుతున్నార‌ని ప‌ట్ట‌ణ పౌర సంక్షేమ సంఘం ఆరోపిస్తోంది తాజా..అక్క‌డ నిర్మిత‌మ‌వుతున్న వాట‌ర్ ప్లాంట్ నిర్మాణంకు రాష్ట్ర స్తాయిలో ఏర‌క‌మైన అనుమతులు ఇవ్వ‌లేద‌ని స్వ‌యంగా  ఉన్న‌తాధికారుల ఇచ్చిన లెటిర్స్ ను స్థానిక జిల్లా  అధికారుల‌కు చూపించి ” స్పంద‌న” లో న్యాయం కోసం…ఆ వాట‌ర్ ట్యాంక్ అక్ర‌మ నిర్మాణ  విషయంపై అధికారుల‌కు ఫిర్యాదు చేసారు.. ప‌ట్ట‌ణ పౌర సంక్షేమ  సంఘం నేత‌లైన రెడ్డి శంక‌ర‌రావు త‌దిత‌రులు.

అయితే ఆ స‌మ‌స్య‌ను డీఆర్ఓ సూచ‌న‌ల‌తో విజ‌య‌న‌గ‌రం మున్సిప‌ల్ క‌మీష‌నర్ వ‌ద్ద‌కు…. అక్క‌డే స‌ద‌రు నేత‌లు క‌లిసి విన్న‌వించ‌గా..ప‌ట్టించుకోకుండా తానిప్పుడే వచ్చాన‌ని త‌న‌కు తెలియ‌ద‌ని… చెప్ప‌డంతో.. ప‌ట్ట‌ణ పౌర‌సంక్షేమ సంఘం నేత అయిన రెడ్డి శంక‌ర‌రావు అగ్గిమీద గుగ్గిలం లా ఫైర్…అయి స్పంద‌న హాలులోనే అధికారుల ఉండ‌గానే… త‌మ ఆవేద‌న‌ను ఎవ్వ‌రూ అర్ధం చేసుకోరా అంటూ  గ‌గ్గొలు పెట్టారు. అదే స‌మ‌యంలో స‌త్యం న్యూస్.నెట్  ప్ర‌తినిధి..త‌క్ష‌ణ‌మే త‌న కెమ‌రాలో స్పంద‌న‌లో జ‌రుగుతున్న అధికారులు వెర్స‌స్ సంఘం నేత‌ల దృశ్యాల‌ను త‌న కెమారాలో బంధించారు.

అయితే ఆ స‌మ్య‌ను సంఘం…. డీఆర్ఓ,ఆ త‌ర్వాత ఆర్డీఓ..చివ‌ర‌కు విజ‌య‌న‌గ‌రం  మున్సిప‌ల్ క‌మీష‌నర్ వ‌ద్ద‌కు స‌మ‌స్య వెళ్ల‌డంతో..కాస్త శాంతించింది..ప‌ట్ట‌ణ పౌర సంక్షేమ సంఘం.అయితే  ఇంత ర‌భస జ‌రుగుతున్న‌..అక్క‌డ బందోబ‌స్తు నిర్వ‌హిస్తున్న కానిస్టేబుల్ ధ‌న‌ల‌క్ష్మి, రమేష్ లు చూస్తూండ‌టం మాత్ర‌మే మిగిలింది. అయితే బ‌య‌ట ఉన్న ఎస్టీఎఫ్ సిబ్బంది ఇద్ద‌రు మాత్రం క‌లెక్ట‌రేట్ ఆడిటోరియం అదే స్పంద‌న జ‌రుగుతున్న ప్ర‌ధాన హాలు వ‌ద్ద మాత్రం లోప‌ల‌కు ఎవ్వ‌రినీ పంప‌కుండా  కాపాలాగ ఉంట‌డం విశేషం.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

5న రాత్రి 9 గంటలకు దీపం వెలిగించండి

Satyam NEWS

మానవ హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యుడు గా కట్టా సంపత్ కుమార్

Satyam NEWS

అదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైనుకు మంత్రి సానుకూలం

Satyam NEWS

Leave a Comment