27.7 C
Hyderabad
May 4, 2024 10: 26 AM
Slider విజయనగరం

బాధితుల గోడును సావ‌ధానంగా విన్న లేడీ పోలీస్ బాస్…!

#spandana

త‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాంటూ విజయనగరం పోలీసు సిబ్బందికి ‘స్పంద‌న’ ద్వారా ఆదేశాలు

విజ‌య‌న‌గ‌రం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వ‌ర్యంలో ప్ర‌తీ సోమ‌వారం జ‌రుగుతున్న స్పంద‌న కార్య‌క్ర‌మానికి  ఫిర్యాదు చేసేంద‌కు వ‌స్తున్న బాదితులు సంఖ్య త‌గ్గుతూ వ‌స్తోంది. గ‌డ‌చిన  ఆరు వారాల నుంచీ జిల్లా కేంద్రానికి అదీ పోలీస్ కార్యాల‌యానికి వ‌స్తున్న ఫిర్యాదుదారుల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గుతోంది. త‌ద్వారా  జిల్లాలో నేర‌ప్ర‌వృత్తి త‌గ్గింద‌నే అని అంటోంది..జిల్లా పోలీస్ శాఖ‌. తాజాగా ప్ర‌తీ వారం మాదిరిగానే ఈ సోమ‌వారం కూడా…జిల్లా పోలీస్ కార్యాల‌యంలో ఎస్పీ దీపికతో పాటు అడిష‌న‌ల్ ఎస్సీ స‌త్య‌నారాయ‌ణ రావు కూడా స్పంద‌న కార్య‌క్ర‌మం ద్వారా బాధితుల నుంచీ పిర్యాదులు తీసుకున్నారు.

స్పంద‌న‌కు వ‌చ్చిన బాధితుల గొడును అటు ఎస్పీ..ఇటు ఏఎస్పీ  సావ‌ధ‌నంగా ఆల‌కించారు.బాధితుల నుంచీ విష‌యం పూర్తిగా క‌నుక్కుని…అక్క‌డిక్క‌డ సంబందిత స్టేష‌న హౌస్ ఆఫీస‌ర్ తో మాట్లాడి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చ‌ర్య‌లు తీసుకునే చ‌ర్య‌లు చేప‌ట్టారు.

మా గోడు ఇదమ్మా…మా మొర ఆల‌కించ‌డమ్మా…మా బాధ మీకు కాక ఇంకెవ్వ‌రికి చెప్పుకోమంటార‌మ్మా..పోలీస్ బాస్ మీరు మీరే స్పందించాలి..! మీరే చ‌ర్య‌లు తీసుకోవాలంటూ బాధితులైన పెద్ద‌వాళ్లు,వృద్దులు కూడా…త‌మ  బాధ‌ను,గోడునుపోలీస్ బాస్ కు చెప్పుకున్నారు వాళ్ల బాధ‌, ఆవేద‌న‌ను క‌ళ్లారా చూసిన ఎస్పీ దీపిక‌…మ‌న‌స్సు కాస్త క‌రిగిపోయింది…క్ష‌ణం ఆగి…వాళ్ల స‌మ‌స్య‌ను ఓ ఎస్పీగా ఎలా ప‌రిష్క‌రించాలో  అన్న దానిపై అక్క‌డిక్క‌డే పున‌రాలోన‌లో ప‌డ్డారు.

వెంట‌నే తేరుకుని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీస‌ర్ తో మాట్లాడి..చ‌ర్య‌లు తీసుకుని వారం రోజుల‌ల్లో ఫలితం చూపించాల‌ని  ఆదేశించారు..ఇక సామాన్య ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి, వారి సమస్యలను శ్రద్ధగా విని, వాటి పరిష్కారానికి సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని, తీసుకున్న చర్యలను తనకు వెంటనే నివేదించాలని ఆదేశించారు.

ఈ స్పంద‌న కార్య‌క్ర‌మంలో ఎస్బీ సీఐలు రుద్ర శేఖర్, జి.రాంబాబు, ఎస్ఐలు మురళి, కృష్ణ వర్మ, ముకుంద రావు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

మరో మూడు రోజులు వర్షాలు

Bhavani

మూడేళ్ల జ‌గ‌న్ ప్ర‌భుత్వం…త‌మ పాల‌న‌పై సింహావ‌లోక‌నం చేసుకోవాలి..!

Satyam NEWS

దేశ భవిష్యత్ యువతపైనే

Bhavani

Leave a Comment