27.7 C
Hyderabad
May 7, 2024 09: 41 AM
Slider చిత్తూరు

రద్దీ నేపథ్యంలో తిరుమలలో వారంతాల్లో బ్రేక్ దర్శనాలు రద్దు

#TTD

రద్దీ నేపథ్యంలో తిరుమలలో వారాంతాల్లో బ్రేక్ దర్శనాలు రద్దు చేయనున్నట్టు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. అధిక రద్దీని అదుపు చేయడానికి అదనపు సిబ్బందిని నియమించామని పేర్కొన్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు నీరు, ఆహారం అందిస్తున్నట్టు తెలిపారు.

త్వరలో లగేజీ కేంద్రాల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానిస్తామని ఆయన ప్రకటించారు. ఈనెల 11 నుండి 17 వరకు 5,29,966 మంది భక్తులు దర్శించుకున్నారని ధర్మారెడ్డి వెల్లడించారు. వారం రోజుల్లో 24,37,744 లడ్డూలు విక్రయించామన్నారు. వారం రోజుల హుండీ ఆదాయం 32.50 కోట్లు వచ్చిందన్నారు. త్వరలోనే స్లాట్ సర్వదర్శనం పునః ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని ధర్మారెడ్డి వెల్లడించారు.

Related posts

‘ఊరు ఊరుకి జమ్మి చెట్టు’ గొప్ప కార్యక్రమం

Satyam NEWS

కాంట్రవర్సీ: నాథూరాం గాడ్సే పై నాగబాబు వ్యాఖ్యలు

Satyam NEWS

నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

Satyam NEWS

Leave a Comment