33.2 C
Hyderabad
May 4, 2024 00: 22 AM
Slider ముఖ్యంశాలు

మరో మూడు రోజులు వర్షాలు

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడుతున్న విషయం తెలిసిందే.కాగా, రానున్న మూడురోజుల్లో రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో గాలులతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు.

ఇది మరింత తీవ్రమై వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల వైపు కదిలే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Related posts

పీఆర్ ప్రాజెక్ట్ పనులకు కావలసిన భూసేకరణను వేగవంతం చేయాలి

Satyam NEWS

హిట్లర్ లాంటి నియంతలే పోయారు… నెవ్వెంత?

Bhavani

మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ఈఎస్ఐ ఉచ్చు?

Satyam NEWS

Leave a Comment