29.7 C
Hyderabad
May 7, 2024 07: 00 AM
Slider విజయనగరం

విజయనగరం పోలీసు స్పందనకు విశేష స్పందన

#vijayanagarampolice

విజయనగరం జిల్లా పోలీసు బాస్ ఎస్పీ దీపిక ముందు తమ గోడు, బాధను వ్యక్త పరిచేందుకు.. అధిక సంఖ్యలో బాధితులు తెగ వస్తున్నారు. అదీ ప్రతీ సోమవారం పోలీసు శాఖ నిర్వహిస్తున్న స్పందనకు. గత వారం కంటే ఈ సోమవారం డీపీఓలో జరిగిన స్పందనకు దాదాపు 45 మంది తమ ,తమ బాధలను ఫిర్యాదులు రూపంలో వ్యక్తపరిచారు. సామాన్య ప్రజల నుండి జిల్లా ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో ఫోనులో మాట్లాడి, వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

విజయనగరం మండలం పినవేమలి కి చెందిన ఒకామె జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేస్తూ తనకు తాతల నుండి సంక్రమించిన భూమిని అదే గ్రామంలో నివాసం ఉంటున్న కొంతమంది వ్యక్తులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, త్రాగి వచ్చి తిడుతూ, దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేసి, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం ఎస్ఐని ఆదేశించారు.

జామి మండలం భీమసింగి గ్రామానికి చెందిన ఒకామె జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేస్తూ తన మామ బ్రతికి ఉన్న సమయంలోనే తన భర్తకు, మరిదికి భూమి పంపకాలు చేసినారు. అప్పటి నుండి ఎవరికి వాటాగా వచ్చిన భూమిలో వారు సాగు చేసుకుంటున్నాము. కానీ, ఇటీవల మా బావ అల్లుడు వచ్చి, పంపకాలు సరిగ్గా జరగలేదని, మాపై దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ జరిపి చట్ట పరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని జామి ఎస్ఐని ఆదేశించారు.

విజయనగరం కు చెందిన ఒక వ్యక్తి చార్ధామ్ యాత్రకు వెళ్లి, ప్రైవేటు ట్రావెల్ ఏజన్సీకి హెలికాప్టర్ చార్జీల నిమిత్తం 80వేలు చెల్లించినట్లు, సదరు యాత్రలో హెలికాప్టర్ టిక్కెట్ అవ్వలేదని, డబ్బులు తిరిగి బ్యాంకు ఖాతాకు పంపుతామని చెప్పి, ఇంత వరకు డబ్బులను తిరిగి పంపలేదని, తాము ఫోను చేసినా స్పందించడం లేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ జరిపి ఫిర్యాదిదారులకు న్యాయం చేయాలని విజయనగరం వన్ టౌన్ సీఐను ఆదేశించారు.

ఎస్.కోటకు చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తనకు ఒడిస్సా రాష్ట్రం జోలాపుట్ జిల్లాకు చెందిన వ్యక్తితో 2018లో వివాహం జరిగిందని, అప్పటి నుండి తన భర్త, అతని బంధువులు తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ జరిపి, చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని ఎస్.కోట ఎస్ఐను ఆదేశించారు.

విజయనగరం పట్టణానికి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ 47వ సచివాలయంలో పని చేస్తున్న వ్యక్తి సచివాలయంలో ఉద్యోగం కల్పిస్తానని నమ్మించి, తన వద్ద నుండి  3.20లక్షలు తీసుకొని, ఇంత వరకు ఉద్యోగం కల్పించలేదని, తాను ఎన్నిసార్లు నగదును తిరిగి ఇవ్వమని కోరినా, ఇవ్వడం లేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ జరిపి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని వన్ టౌన్ సీఐను ఆదేశించారు.

భోగాపురం మండలం రాజాపులోవకు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి సైన్యంలో ఉద్యోగం కల్పిస్తామని, తన వద్ద నుండి 4 లక్షలు తీసుకొని, ఎటువంటి ఉద్యోగం కల్పించలేదని, తాను డబ్బులను తిరిగి ఇవ్వమని కోరినా, ఇంత వరకు డబ్బులును కూడా చెల్లించకుండా తాత్సారం చేస్తున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ జరిపి, చట్ట ప్రకారం చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని భోగాపురం ఎస్ఐను ఆదేశించారు.

“స్పందన”లో స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, ఏడు రోజుల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను తనకు నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ దీపికా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణరావు, డీసీఆర్బీ సీఐ డా. బి.వెంకటరావు, ఎస్బీ సీఐలు సి.హెచ్. రుద్రశేఖర్, జి.రాంబాబు, ఎస్ఐ లోకేశ్వరరావు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

వివాహ భోజనంబు’లో తొలి పాట ‘ఎబిసిడి…’ విడుదల

Satyam NEWS

చిన్న అంబానీకి ఎన్ ఫోర్సుమెంటు డైరెక్టరేట్ సమన్లు

Satyam NEWS

మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతం చేయాలి

Satyam NEWS

Leave a Comment