30.7 C
Hyderabad
April 29, 2024 06: 16 AM
Slider ముఖ్యంశాలు

చిక్కుల్లో ఉన్న జర్నలిస్టులను ఆదుకుంటున్న NAJA

#journalist

వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి చిక్కుల్లో పడిపోతున్న జర్నలిస్టులను ఆదుకోవడానికి ఆవిర్భవించిన నాన్ అక్రిడిటేషన్ జర్నలిస్ట్ అసోసియేషన్ తన కార్యకలాపాలను మరింత విస్తృత పరిచేందుకు సిద్ధం అవుతున్నది. అక్రమ కేసుల్లో ఇరుక్కొని ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులను ఆదుకోవడమే ధ్యేయంగా, నేనున్నాను అంటూ సాయం చేసేందుకు ముందుకు వచ్చే సంస్థగా నాన్ అక్రిడిటేషన్ జర్నలిస్ట్ అసోసియేషన్ (NAJA) ఉంది.

అధికారుల నుండి, రాజకీయ నాయకుల నుండి జర్నలిస్టుకు ఇబ్బంది కలిగినప్పుడు లేదా వాస్తవాలు బయటకు రావడం భరించలేని వారు దాడులు చేసినప్పుడుగానీ ఆ జర్నలిస్టు ఎటు పోవాలో, ఎవరిని కలవాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టడుతూ ఉండేవారు. కొన్ని జర్నలిస్టు సంఘాలు ఉన్నాయి, కానీ ఏ సంఘం కూడా ఇలాంటి జర్నలిస్టులకు సాయం చేయడం లేదు.

వారి దగ్గరకు వచ్చిన జర్నలిస్టులకు వచ్చిన కష్టం గురించి చెప్పుకునే అవకాశం ఉండేది కాదు. అక్రమ కేసుల బారినపడి జైలుకు వెళ్లి వచ్చిన వారు, అలాగే దాడులకు గురైన జర్నలిస్టులు మళ్లీ తల ఎత్తుకొని నేడు గర్వంగా తిరుగుతున్నారు అంటే దానికి కారణం NAJA. జరిగిన అన్యాయం తెలుసుకుని, వారి వెన్నంటి ఉండి వారికి అన్ని విధాలుగా భరోసానిచ్చేందుకు NAJA ప్రయత్నిస్తుంది.

రవి కుమార్ బుద్ధారం, కొల్లాపూర్ అవుటర్ రాజశేఖర్, మందడి చిరంజీవి, తొలి వెలుగు రఘు, క్యూ న్యూస్ మల్లన్న, పెబ్బేరు స్వామి, అశోక్ రెడ్డి, రవి కుమార్ నవతెలంగాణ, విజయ్ మెదక్, రాజు నిజామా బాద్ వీళ్ళందరూ రక రకాలుగా దాడులకు గురైన వారే.

అలా జర్నలిస్టుల  ఇబ్బందులను అడుగుతున్న ఏకైక సంఘం, జర్నలిస్టులకు అండగా ఉన్న సంఘం ఏదైనా ఉంది అంటే అది నాన్ అక్రిడిటేషన్ జర్నలిస్ట్ అసోసియేషన్ సంఘం మాత్రమే. త్వరలో జిల్లా వ్యాప్తంగా కమిటీలు వేయాలని నిర్ణయం తీసుకున్నామని నాజా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్ బుద్ధారం (Call:9666480481) తెలిపారు.

Related posts

చక్కెర ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం

Satyam NEWS

పెద్దిరెడ్డి.. తాగి వచ్చి నా కాళ్లు పట్టుకున్నావ్‌..!

Satyam NEWS

ధార్మిక కార్య‌క్ర‌మాల ప్ర‌సారం కోసం ఎస్‌బిఐ స్పాన్స‌ర్‌షిప్‌

Satyam NEWS

Leave a Comment