29.7 C
Hyderabad
May 4, 2024 04: 27 AM
Slider విజయనగరం

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి “స్పందన”

#deepika patil

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించేందుకు “స్పందన” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ దీపికా.పాటిల్ నిర్వహించారు. ఫిర్యాదుదారుల నుండి జిల్లా ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో ఫోనులో మాట్లాడి, వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టి, ఫిర్యాదుదారులను న్యాయం చేయాలని ఆదేశించారు.

“స్పందన” కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ 43 ఫిర్యాదులను స్వీకరించి, ఇచ్చిన ఫిర్యాదులకు రశీదులను అందజేసి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. విజయనగరంకు చెన్నారెడ్డి కాలనీకి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తనకు పరిచయం ఉన్న ఒకామె గాజులరేగలో అగరబత్తులు తయారు చేసే కంపెనీలో పెడుతున్నట్లు, భాగస్వామిగా తనని చేరమని, నా వద్ద నుండి 4 లక్షలు తీసుకున్నారని, తరువాత ఆ కంపెనీలో తనకు వాటా ఇవ్వకపోగా, తీసుకున్న మొత్తాన్ని కూడా తిరిగి చెల్లించలేదని, న్యాయం చేయాల్సిందిగా కోరారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విజయనగరం 1వ పట్టణ సీఐను విచారణ చేపట్టి, చట్టపరమైన చర్యలు తీసుకోని, ఫిర్యాదికి న్యాయం చేయాల్సిందిగా ఆదేశించారు. జిల్లా లోని ఎస్.కోటకు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తనకు ఎస్.కోటలో కొంత వ్యవసాయ భూమి ఉన్నదని, సదరు భూమిని తన అన్నగారి కుమారులు కాజేయాలని, బెదిరింపులకు పాల్పడుతున్నారని, న్యాయం చేయాల్సిందిగా కోరారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, డాక్యుమెంట్లును పరిశీలించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్.కోట సిఐను ఆదేశించారు. విజయనగరం కెఎల్ పురంకు చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తాను ఒక వ్యక్తి నుండి ప్లాట్ ను కొనుగోలు చేసినట్లు, సదరు వ్యక్తికి అదే ఇంటిలో ఉంటూ, నెలకు 6వేలు చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నట్లు, కానీ సదరు వ్యక్తి గత పదకొండు మాసాలుగా ఎటువంటి అద్దె చెల్లించడం లేదని, ఇంటికి కూడా ఖాళీ చేయడం లేదని, న్యాయం చేయాల్సిందిగా కోరారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ ఇరు వర్గాలను పిలిచి, విచారణ చేపట్టి, చట్టపరిధిలో చర్యలు చేపట్టాలని, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం 1వ పట్టణ సిఐను ఆదేశించారు. జిల్లా లోని బాడంగి మండలం కోడూరుకు చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తనకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇల్లుసు కాజేయాలని ఉద్దేశ్యంతో తన తోడికోడలు, ఆమె కుమార్తె బెదిరింపులకు పాల్పడుతున్నారని, తనను ఇంటి నుండి వెళ్ళగొట్టి, సదరు ఇంటిని స్వాధీనపర్చుకున్నారని, ఇంటి కాగితాలు, పన్నులు అన్నీ తన పేరు మీదనే ఉన్నాయని, న్యాయం చేయాలని కోరారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ డాక్యుమెంట్లును పరిశీలించి, చట్ట పరిధిలో ఫిర్యాదికి న్యాయం చేయాలని బొబ్బిలి రూరల్ సీఐను ఆదేశించారు. విజయగరం గాజులరేగకు చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన భర్త ప్రభుత్వ ఉద్యోగం చేసి, మృతి చెందారని, ప్రభుత్వం తన పేరున ఇంటిని మంజూరు చేయగా, సదరు ఇంటిలో నివాసం ఉంటున్నట్లు, ఇప్పుడు కుమారుడు, కోడలు నదరు ఇంటిని ఖాళీ చేయాలని, ఒత్తిడి చేస్తూ, వేధిస్తున్నారని, న్యాయం చేయాలని కోరారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చర్యల చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాల్సిందిగా విజయనగరం 2వ పట్టణ సీఐను ఆదేశించారు. జిల్లాలోని కొత్తవలస మండలం అప్పన్న దొరపాలెం కి చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తనకు వ్యవసాయ భూమి కలదని, సదరు భూమిని ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన కొంతమంది వ్యక్తులు తన భూమిని ఆక్రమించు కొనేందుకు జేసీబీలతో పనులు చేయిస్తున్నారని, అడ్డు కొనేందుకు ప్రయత్నించగా, తమను బెదిరిస్తున్నారని, న్యాయం చేయాలని కోరారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ ఇరు వర్గాలను పిలిపించి, డాక్యుమెంట్లును పరిశీలించి, చర్యలు చేపట్టాలని, ఫిర్యాదికి న్యాయం చేయాలని కొత్తవలస సీఐను ఆదేశించారు.స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, 7 రోజు ల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదుల పై తీసుకున్న చర్యలను తనకు వెంటనే నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు, డీసీఆర్ బి సీఐ బి.వెంకటరావు, ఎస్పీ సీఐలు జి.రాంబాబు, ఎన్.శ్రీనివాసరావు, ఎస్ ఐ లు నీలకంఠం నాయుడు, కృష్ణవర్మ, సూర్యారావు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

కరోనా వ్యాక్సిన్ వికటించి వాలంటీర్ మృతి

Satyam NEWS

క్రీడలతో శారీరిక దారుడ్యాన్ని పెంపొందించుకోవాలి

Satyam NEWS

ఏప్రిల్ 5 ఛలో ఢిల్లీ… సీఐటీయూ పిలుపు…!

Satyam NEWS

Leave a Comment