38.2 C
Hyderabad
May 5, 2024 19: 52 PM
Slider విజయనగరం

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు “స్పందన”

#spandana

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు “స్పందన” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఎం. దీపిక  నిర్వహించారు. సామాన్య ప్రజల నుండి జిల్లా ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

“స్పందన” కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీగారు 34 ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. పూసపాటిరేగ మండలం లంకలపాలెం  కి చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ, జూలై 30 యధావిధిగా తన ఇంటి వద్ద పనులు చేసుకొనుచుండగా, తన ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఫిర్యాదిని అసభ్యకర పదజాలంతో తిట్టి, చేతులతో కొట్టి, చంపుతామని బెదిరించినట్లు, న్యాయం చేయాలని కోరారు.

స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని పూసపాటిరేగ ఎస్ఐను ఆదేశించారు. విజయనగరం కు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తాను మున్సిపల్ కార్పొరేషనులో కాంట్రాక్టు వర్కరుగా పని చేస్తున్నట్లు, తనకు చదువురాని కారణంగా పి.ఎఫ్. లోను తీసేందుకు కొంతమంది వ్యక్తులను సంప్రదించగా, సదరు వ్యక్తులు ఫిర్యాదికి తెలియకుండా 90వేలు బ్యాంకు ఖాతా నుండి తీసివేసి, మోసగించినట్లు, న్యాయం చేయాలని కోరారు.

చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం డిఎస్పీని జిల్లా ఎస్పీ ఆదేశించారు. పూసపాటిరేగ మండలం బర్రిపేట కి చెందిన ఒకరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు తమ వ్యవసాయ భూమిలో బోరు త్రవ్వకుండా అడ్డుకుంటున్నారని, న్యాయం చేయాలని కోరారు.

ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని పూసపాటిరేగ ఎస్ఐను ఆదేశించారు. గజపతినగరం మండలం మరుపల్లి కి చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ విజయనగరం పట్టణంకు చెందిన ఒక వ్యక్తి వద్ద మరుపల్లిలోగల ఒక ఫ్లాట్ను 22 లక్షలకు కొనుగోలు చేసేందుకు 2020లో ఒప్పందం కుదుర్చుకున్నట్లు, అందుకు 5 లక్షలు అడ్వాన్సుగా చెల్లించినట్లు, కానీ, సదరు ఫ్లాట్ యజమాని ఇంత వరకు రిజిస్ట్రేషను చెయ్యకుండా తాత్సారం చేస్తున్నారని, తాను అడ్వాన్సుగా ఇచ్చిన సొమ్మును కూడా తిరిగి చెల్లించడం లేదని, న్యాయం చేయాలని కోరారు.

చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయ గజపతినగరం ఎస్ఐను జిల్లా ఎస్పీ ఆశించారు. విజయనగరం  కు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ విజయనగరం కు చెందిన ఒక వ్యక్తి తన వ్యక్తి అవసరాల నిమిత్తం 1లక్ష చేబదులుగా తీసుకున్నట్లు, తిరిగి చెల్లించడం లేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం టూటౌన్ సీఐను ఆదేశించారు.

బొబ్బిలి  కు చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ అదే ప్రాంతానికి చెందిన వ్యక్తికి అవసరాల నిమిత్తం 2 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు, సదరు వ్యక్తి అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించడం లేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని బొబ్బిలి సిఐను ఆదేశించారు. ఈ “స్పందన”లో స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, ఏడు రోజుల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను తనకు నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎం. దీపిక ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్, ఎస్సీ మరియు ఎస్టీ సెల్ డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, డీసీఆర్బీ సిఐ జె. మురళి, ఎస్బీ సిఐలు కె.కె. వి. విజయనాధ్, ఈ. నర్సింహమూర్తి, డీసీఆర్బీ ఎస్ఐ వాసుదేవ్ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

అధికార వైసీపీపై తిరగబడుతున్న ఎమ్మెల్యేలు

Satyam NEWS

పాతపట్నంలో మాస్కులు పంపిణీ చేసిన ఎంజీఆర్

Satyam NEWS

అభిమానికి బాలయ్య బాబు అభిమానుల నివాళి

Satyam NEWS

Leave a Comment