23.2 C
Hyderabad
May 7, 2024 20: 11 PM
Slider మహబూబ్ నగర్

దయా గుణం చూపిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు

special branch

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం దేశం మొత్తంలో లాక్ డౌన్ నడుస్తున్న సందర్భంగా వనపర్తి పట్టణంలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మానవత్వం చూపారు. వీధుల్లో అనాథలకు, పేద వారికి, మతిస్థిమితం లేని వారికి, తినడానికి తిండిలేక  ఆకలితో తల్లడిల్లుతున్న వారిని పోలీసులు ఆదుకున్నారు.

వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయం స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై వెంకట్ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలోని 200 మందికి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఎస్సై వెంకట్ మాట్లాడుతూ కరోన వైరస్ నియంత్రించడం కోసం కొనసాగుతున్న లాక్ డౌన్ కారణంగా యాచకులు, అనాథలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇది చూసి భోజన సదుపాయం కల్పించామని అన్నారు.

వైరస్ తో పాటు ముదురుతున్న ఎండలకు మరికొందరికి త్రాగడానికి మంచినీరు సహితం దొరకడం లేదని ఇలాంటివి కనిపిస్తే చాలా బాధేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి అనాథలు ఎక్కడైనా కనిపిస్తే మానవత్వంతో ముందుకు వచ్చి సహకరించాలని ఆయన దాతలను కోరారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుళ్ళు, జగన్మోహన్, సిద్ధాంత శ్రీనివాసశర్మ, కానిస్టేబుళ్లు, గౌస్ పాషా ,రాకేష్, శ్రీనివాసులు, పాల్గొన్నారు.

Related posts

అమరావతి సాధన సమితి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

Satyam NEWS

మార్చి 3లోపు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు

Satyam NEWS

22న నిఖిల్,అనుపమ పరమేశ్వరన్ “18 పేజిస్” లిరికల్ వీడియో విడుదల

Bhavani

Leave a Comment