40.2 C
Hyderabad
April 29, 2024 15: 49 PM
Slider ఆంధ్రప్రదేశ్

మార్చి 3లోపు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు

ap high court on local body

స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. మార్చి 3లోపు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తామని అఫిడవిట్‌లో పేర్కొంది. ఫిబ్రవరి 8 నుంచి మార్చి3 మధ్య గ్రామపంచాయతీ ఎన్నికలు పూర్తి చేస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. జనవరి 17 నుంచి ఫిబ్రవరి 15 మధ్య ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేస్తామని వెల్లడించింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఉన్నత న్యాయస్థానం పచ్చజెండా ఊపడంతో 660 జడ్పీటీసీ, 660 మండల పరిషత్‌లతో పాటు 10,229 ఎంపీటీసీలు, 12,951 గ్రామపంచాయతీలు, 1,31,116 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరిగే అవకాశముంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా జనవరి 10న సీఎస్‌, డీజీపీ, ఆర్థిక శాఖ, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శులతో, జనవరి 13న అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం కానుంది.

Related posts

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు భద్రతా చర్యలు చేపట్టాలి

Satyam NEWS

పూర్ణాహుతితో ముగిసిన భవానీ మండల దీక్షలు

Satyam NEWS

పేదల బియ్యం విదేశాలకు ఎగుమతి?

Bhavani

Leave a Comment