26.7 C
Hyderabad
May 12, 2024 10: 55 AM
Slider హైదరాబాద్

బస్తీల పరిశుభ్రతకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం

#Nallakunta Division

రానున్న వర్షాకాలంలో బస్తీలలో సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉన్నందున  పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం జూన్ 1 నుంచి 8 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని నల్లకుంట కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేష్ పేర్కొన్నారు.

మున్సిపల్  శాఖ మంత్రి  కే టీ ఆర్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశాలు ఇచ్చారని, ఆ మేరకు వారం రోజులు శానిటేషన్  ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. నల్లకుంట డివిజన్ లోని కోరంటి ఫీవర్ హాస్పిటల్ చౌరస్తా నుండి ఓయూ గేట్ వరకు  పట్టణ ప్రగతి సమగ్ర పరిశుభ్రత కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్  మాట్లాడుతూ ఈ వారం రోజుల్లో డివిజన్లో  ఎక్కడ కూడా చెత్త చెదారం లేకుండా,మురికి గుంతలు లేకుండా శానిటేషన్ సిబ్బంది తో కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. 

కాలనీ వాసులు, అపార్ట్ మెంట్స్ అసోసియేషన్  అందరూ సహకరించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో  జీహెచ్ఎంసి శానిటేషన్ SFA, జవాన్లు  వాసుదేవరెడ్డి, ఎల్లేష్, బాబురావు, సురేష్, శ్రీనివాస్, యాదగిరి  మరియు శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

మౌలికవసతుల కల్పనకు ప్రధమ ప్రాధాన్యం

Satyam NEWS

బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ చేసిన కాయకల్ప బృందం

Satyam NEWS

ధ‌ర‌ణి మ‌రింత ఆల‌స్యం!

Sub Editor

Leave a Comment