40.2 C
Hyderabad
April 26, 2024 13: 45 PM
Slider నిజామాబాద్

బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ చేసిన కాయకల్ప బృందం

hospital

బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం కాయకల్ప వైద్య బృందం తనిఖీ చేసింది. ఆసుపత్రిలో నిర్వహిస్తున్న డెలివరీలు, రోగులకు అందుతున్న సేవలు తదితర విషయాలు పరిశీలించారు. డెలివరీ రూమ్ శుభ్రంగా ఉంచాలని చెత్తాచెదారం లేకుండా చూడాలని తుప్పు పట్టిన పరికరాలు వాడరాదని పరిసరాలను పరిశీలించి సిబ్బందికి ఆదేశించారు. అనంతరం కాయకల్ప తనిఖీ బృందం వైద్యులు మాట్లాడుతూ కాయకల్ప తనిఖీల ద్వారా ఆస్పత్రుల్లో అందుతున్న వైద్యసేవలు గ్రేడింగ్ ప్రకటించి ప్రభుత్వం ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించామని, ఈ బృందం ఐదు దఫాలుగా పర్యటించి తనిఖీలు నిర్వహిస్తుందని అన్నారు.

70 శాతం పైన ఉన్న  తనిఖీలు నిర్వహించిన ఆసుపత్రులకు 70 శాతం పైన గ్రేడింగ్ ఉన్న వాటికి నిధులు కేటాయించామని అన్నారు. ఈ నిధులలో నుండి 25 శాతం పనిచేస్తున్న సిబ్బందికి 75% ఆసుపత్రి అభివృద్ధికి ఖర్చుచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు తిరుపతి, dpo చిరంజీవులు, డాక్టర్ శ్రీకాంత్, జిల్లా క్వాలిటీ మేనేజర్లు రాము వైద్యులు ప్రవీణ్ కుమార్ ఆరోగ్య బోధకులు దస్తీరాం,  ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు.

Related posts

వైసీపీ ప్రభుత్వం కూడా ఇంధన ధరలు తగ్గించాలి

Satyam NEWS

[2022] Lionheart Male Enhancement Do Penis Extenders Work

Bhavani

తెలంగాణలో అమలులోకి తెచ్చిన ఎయిరో ప్రాజెక్టులెన్ని?

Satyam NEWS

Leave a Comment