38.2 C
Hyderabad
May 5, 2024 19: 29 PM
Slider విజయనగరం

పోలీసుల‌కూ వారి కుటుంబాల‌ కోసం ప్ర‌త్యేక ఐసొలేష‌న్ వార్డు

#RajakumariIPS

క‌రోనా నృత్యం చేస్తున్న వేళ‌….ఆ వైర‌స్ బారిన ప‌డ్డవారెంద‌రో…! పైకి మాత్రం ఏమీ తెలియ‌కుండా  ప్ర‌తీ  ఒక్కరూ ఉన్నారు. కుటుంబ యజ‌మానితో పాటు ఆ కుటుంబంలో అంద‌రికీ వైర‌స సొకడంతో ప్ర‌తీ ఒక్క‌రూ ఇంట్లోనే ఐసోలేష‌న్ లోనే ఉంటూ క‌రోనా వైర‌స్ బారిన ప‌డి  ఆఫీసుల‌కే సెలవు పెట్టేస్తున్నారు. ఎలాగో రాష్ట్ర ప్ర‌భుత్వం లాక్ డౌన్ పెట్టేయ‌డంతో రెండుప్ర‌ధాన శాఖ‌లైన రెవిన్యూ,పోలీస్ యంత్రాంగానికి చెందిన ప‌లువురు హోం ఐసోలేష‌న్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.

తాజాగా  అటువంటి వారి కోసం విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ రాజ‌కుమారీ ప్ర‌త్యేకించి ఐసోలేష‌న్ వార్డును ఏర్పాటు చేసారు.అదీ బ్యారెక్స్ లోని పోలీస్ ట్రైనింగ్ క‌ళాశాల‌లో ఓ బ్లాక్ లో పోలీసు కుటుంబాల కోర‌కు ప్ర‌త్యేకించి 44 బెడ్ ల‌తో ఓ ఐసోలేష‌న్ వార్డును ద‌గ్గ‌రుండీ ఎస్పీ  రాజ‌కుమారీ ఏర్పాటు చేసారు.గ‌తేడాదిద ఇలానే యావత్ పోలీస్ శాఖ‌లో దాదాపు 450 మందికి క‌రోనా రావ‌డంతో     ప్ర‌త్యేకించి చికిత్స‌కై  జిల్లా కేంద్ర స‌మీపంలోని సారిప‌ల్లి పీటీసీలోసిబ్బందికి చికిత్స ఇచ్చేందుకు ఏర్పాటు చేసారు.

ఈ సారి కూడా అదే మే నెలలో పోలీసు సిబ్బందికి  అందునా వారి కుటుంబ స‌భ్యుల‌కు కూడా క‌రోనా వైర‌స్ సోకి హోం ఐసోలేష‌న్ లోఉండ‌టాన్ని తెలుసుకున్న ఎస్పీ…ఉన్న ప‌ళంగా  పోలీసు ట్రైనింగ్ క‌ళాశాల ప్రిన్సిప‌ల్ తో మాట్లాడి..వసంత  బారెక్ లోదాదాపు 44 బెడ్ ల‌ను త‌న శాఖా సిబ్బందికి  క‌ల్పించారు.

ఇందులో భాగంగా  ఆ ఐసోలేష‌న్ బెడ్స్ ను ఎస్పీ రాజ‌కుమారీ 22 వ  తేదీన ప్రారంభించారు. మొత్తం రెండు బ్యాక్ ల‌లో ఏర్పాటు చేసిన మొత్తం 44 బెడ్ ల‌ను ఎస్పీ..పీటీసీ ప్రిన్సిప‌ల్, ఏఆర్ డీఎస్పీ శేషాద్రి, ఎస్.బీ. సీఐలు శ్రీనివాస‌రావు,రాంబాబుల‌తో క‌లిసి సంయుక్తంగా ప‌రిశీలించారు.

అనంత‌రం ఎస్పీ మీడియాతో మాట్లాడారు.ఈ క‌రోనా సెకండ్ వేవ్ ప‌ట్ల ప్ర‌తీ ఒక్క‌రూ అందునా పోలీసు సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. ప్ర‌త్యేకించి పోలీస్ సిబ్బందిలో పురుషుల‌తో పాటు స్త్రీల కు కూడా బేర‌క్ లో క‌ల్పించిన ఐసోలేష‌న్ వార్డులో క‌రోనా ప‌రంగా చికిత్స పొంద‌వ‌చ్చ‌ని అవ‌ర‌స‌మైన మేర‌కు  దాదాపు 50 ఆక్సిజ‌న్ సిలెండర్ల‌ను ఏర్పాటు చేసామ‌ని ఎస్పీ ఈ సంద‌ర్బంగా తెలిపారు.

Related posts

కల్లుగీతకు అనుమతిచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు

Satyam NEWS

మేడే కార్యక్రమాన్ని జయప్రదం చేయండి: ఐఎఫ్టియు

Satyam NEWS

అండర్-15 ఏసియా సాఫ్ట్ బాల్ పోటీల్లో సత్తా నిరూపించాలి

Bhavani

Leave a Comment