40.2 C
Hyderabad
May 2, 2024 18: 44 PM
Slider అనంతపురం

అండర్-15 ఏసియా సాఫ్ట్ బాల్ పోటీల్లో సత్తా నిరూపించాలి

#AP Softball

తైవాన్ దేశంలోని పులి టౌన్ షిప్ ఈనెల 13 నుండి 17 వరకు జరిగనున్న అండర్-15 ఏసియా ఉమెన్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొనే భారత సాఫ్ట్బాల్ మహిళల జట్టు తమ సత్తా చాటాలని ఏపీ సాఫ్ట్ బాల్ సంఘం సీఈఓ

సి.వెంకటేసులు సూచించారు. అనంతపురం ఆర్డీటీ క్రీడా మైదానంలో జరుగుతున్న కోచింగ్ క్యాంపు శుక్రవారం ముగిసింది. ఆర్డీటీ గ్రాస్ రూట్ కో-ఆర్డినేటర్, ఏపీ సాఫ్ట్ బాల్ రాష్ట్ర కార్యదర్శి సి.నాగేంద్ర హాజరయ్యారు. వారు

మాట్లాడుతూ అండర్- 15 ఏషియా సాఫ్ట్బాల్ మహిళల ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొనే భారత మహిళల జట్టు పతకంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్క క్రీడాకారుడు  కలిసికట్టుగా దేశం కోసం ఆడాలని, కోచింగ్ క్యాంపులో

నేర్చుకున్న నైపుణ్యాలను అక్కడ ప్రదర్శించి  అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేయాలన్నారు.  తైవాన్ లో పాల్గొనే అండర్-15 మహిళల సాఫ్ట్బాల్ టీం ఎంపికలు ఈ ఏడాది ఏప్రిల్ 8,9వ

తేదీలలో హైదరాబాదులో నిర్వహించగా  ఎంపిక పోటీలలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి పాల్గొన్న క్రీడాకారుల్లో అత్యంత ప్రతిభ ఉన్నవారిని జట్టుకు ఎంపిక చేశామన్నారు. ఎంపికైన ఈ  మహిళా జట్టుకు మూడవ కోచింగ్ క్యాంప్

అనంతపురంలో  నిర్వహించడం హర్షించదగ్గ విషయమని, ఈనెల 11న తైవాన్ దేశానికి భారత సాఫ్ట్బాల్ మహిళా జట్టు బయలుదేరుతుందన్నారు. . అత్యంత వెనుకబడిన  అనంతపురం జిల్లాలో క్రీడల అభివృద్ధికి ఆర్డీటీ చేస్తున్న కృషి

మరువలేనిదన్నారు.   జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్బాల్ క్రీడాకారులు విశేషమైన ప్రతిభను కనబరుస్తున్నారని ఇది ఆర్డీటీ అందించిన ప్రోత్సాహమేనని ఆర్డిటి ప్రోగ్రాం డైరెక్టర్ మాంచూ ఫెర్రర్ జు ప్రత్యేక

కృతజ్ఞతలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో  పీడీలు ప్రభాకర్, కేశవమూర్తి, గోపాల్ రెడ్డి, లతాదేవి, సాఫ్ట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గంగులయ్య, చంద్రశేఖర్, కోచ్ లు విజయ్ కుమార్(కర్ణాటక), శివాజీనాయక్ సాయి, సింహాద్రి, లక్ష్మి , వరుణ్ తదితరులు పాల్గొన్నారు.

తైవాన్ లోని పులిలో పాల్గొనే భారత అండర్-15 భారత సాఫ్ట్ బాల్ మహిళల జట్టు

1.సౌమ్యరాణి, జి.సౌందర్య జి.సాత్విక, డి.సరయు, డి.కార్తీక, తులసి, జి.శ్రావిక (తెలంగాణ), స్మైలీ, కీర్తన (ఆంధ్ర ప్రదేశ్), కామిని, జెన్నీఫర్(తమిళనాడు), హెలెన్, మెరీన్ (కేరళ), కావేరి, ప్రిన్సి (మహారాష్ట్ర), శృతి (ఢిల్లీ).

Related posts

కన్నా లక్ష్మీనారాయణకు మళ్లీ మహర్దశ?

Satyam NEWS

బస్సుల్లో శ్రీశైలం వెళ్లే భక్తులకు స్పర్శ దర్శనం టిక్కెట్లు

Satyam NEWS

కరోనా ఎఫెక్ట్: చిలుకూరు బాలాజీ టెంపుల్ కు నో ఎంట్రీ

Satyam NEWS

Leave a Comment