Slider ముఖ్యంశాలు

కల్లుగీతకు అనుమతిచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు

#Minister Srinivasa gowd

తెలంగాణ రాష్ట్రం లో కల్లు గీత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కల్లు గీత కార్మికులు కల్లు అమ్ముకునేందుకు అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు, అందుకు విశేష కృషి చేసిన రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ కు ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

రాజేంద్ర నగర్ శాసన సభ్యుడు ప్రకాష్ గౌడ్ నేతృత్వంలో రాజేంద్ర నగర్, శంషాబాద్ మండలంలోని కల్లు గీత కార్మికులు, గౌడ సోదరులు కలసి మంత్రికి కృతజ్ఞతలు తెలిపినవారిలో ఉన్నారు. తాటి చెట్ల వద్ద భౌతిక దూరం పాటిస్తూ లాక్ డౌన్ నిబంధనల కు అనుగుణంగా కల్లు గీసుకోవడానికి అమ్ముకోవడానికి ప్రభుత్వం ఇటీవల అనుమతినిచ్చింది.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కల్లు గీత కార్మికులు భౌతిక దూరం పాటించి కల్లు ను అమ్ముకోవడానికి అనుమతి ని ఇచ్చారన్నారు. గీత కార్మికులు లాక్ డౌన్ నిబంధనలు పాటించి కల్లును అమ్ముకోవాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేతి వృత్తిదారుల పూర్వ వైభవానికి కృషిచేస్తున్నారన్నారు. మంత్రి సూచనల మేరకు గీత కార్మికులు భౌతిక దూరం పాటించి కల్లును అమ్ముకుంటారని, లాక్ డౌన్ నిబంధనలు పాటించి గీత  కార్మికులు కల్లు అమ్ముకుంటారని కార్మికుల పక్షాన రాజేంద్ర నగర్ శాసన సభ్యులు ప్రకాష్ గౌడ్ హామీనిచ్చారు.

ఈ కార్యక్రమంలో మైలర్ దేవులపల్లి మాజీ కార్పొరేటర్ ప్రేమ్ దాస్ గౌడ్, కాశీ నాధ్ గౌడ్, హరి చరణ్ గౌడ్, వెంకటేష్ గౌడ్, విట్ఠలయ్య గౌడ్, ఉడాల కృష్ణ గౌడ్ తదితర గౌడ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Related posts

ములుగు జిల్లా తైక్వాండో కోచ్ అనిల్ సేవలు అభినందనీయం

Satyam NEWS

ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు బ్రిటన్ ఆర్ధిక మంత్రి

Satyam NEWS

విజయనగరం జిల్లా న్యాయ‌స్థానానికి కొత్త‌ భ‌వ‌న స‌ముదాయం

Satyam NEWS

Leave a Comment