40.2 C
Hyderabad
April 29, 2024 15: 25 PM
Slider నల్గొండ

లాక్ డౌన్ పటిష్ట అమలుకు డ్రోన్ కెమెరాల వినియోగం

#NalgondaPolice

ప్రధాన రహదారులతో గల్లీల్లో డ్రోన్ లతో పర్యవేక్షణ

అనవసరంగా రోడ్ల మీదకు వస్తే వాహనాలు సీజ్, కేసుల నమోదు

లాక్ డౌన్ కఠిన అమలు కోసం నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ డ్రోన్ కెమెరాలను వినియోగిస్తుందని నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.

శనివారం నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో డ్రోన్ కెమెరాల ద్వారా లాక్ డౌన్ అమలు తీరును ఆయన పర్యవేక్షించారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రంగనాధ్ ఆదేశాల మేరకు నల్లగొండతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలను వినియోగించడం ద్వారా లాక్ డౌన్ మరింత కఠినంగా ఆమలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేసే క్రమంలో గల్లీలలో అనవసరంగా బయట తిరిగే వారిని, కారణం లేకుండా బయటికి వచ్చే వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని, బైకులు, వాహనాలను సీజ్ చేయడంతో పాటు జరిమానాలు విధించడం జరుగుతుందని చెప్పారు.

కరోనా కట్టడి కోసం పోలీస్ శాఖ మరింత కఠిన చర్యలు చేపడుతూ కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం కృషి చేస్తున్నదని చెప్పారు.

ఆయన వెంట ఐ.టి. విభాగం సిఐ రౌతు గోపి, సిఐ చంద్రశేఖర్ రెడ్డి, సిబ్బంది రియాజ్, సుధాకర్ తదితరులున్నారు.

Related posts

మసీదు నిర్మాణానికి వేరే చోట 5 ఎకరాల చోటు

Satyam NEWS

ప్రజలందరూ ఆరోగ్యంతో ఉండాలనేదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం

Satyam NEWS

కాంగ్రెస్, బిజెపిలు కేసీఆర్ జేబు సంస్థలు: షర్మిల

Satyam NEWS

Leave a Comment