గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన యువతకు ప్రభుత్వం ఎలాంటి భద్రత కల్పించలేదని రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ పట్టుభద్రుల ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని ఎమ్మెల్సీ అభ్యర్తి సంతోష్ కుమార్ అన్నారు.
ఆయన కల్వకుర్తి పట్టణంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాష్టంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని పాలకులు పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కరోనా కష్ట కాలంలో ప్రైవేట్ పాఠశాలలు,కళాశాల పనిచేసే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం కార్పొరేట్ కు కొమ్ముకాస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో విద్యాహక్కు చట్టాన్ని పాలకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రైవేట్ ఉద్యోగులకు పిఎఫ్ ఇవ్వడం లేదని అదేవిధంగా జీతాలు లేక పాటశాల, కళాశాల ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంత నిరుద్యోగులు వివక్షకరణమని అన్నారు.ఏళ్ళు గడుస్తున్నా నెట్,సెట్,పి హెచ్ డి నోటిఫికేషన్ లేవని అన్నారు.
తాను ఎమ్మెల్సీ గెలుపోందితే ప్రత్యేకంగా నిరుద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. రాష్టంలో నేటికి 3 లక్షల ఉద్యోగాలు కలిగే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలను భర్తీచేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉమాదేవి, కార్పొరేట్ JAC చైర్మన్ శ్రీనివాస్,నరేష్, సుగుణకర్, శరత్, భాస్కర్,వెంకట్,తదితరులు పాల్గొన్నారు.