26.7 C
Hyderabad
May 3, 2024 09: 37 AM
Slider శ్రీకాకుళం

ప్రోగ్రెస్:పెద్దపాడు ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ

pedapadu school

శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని ఉన్నత పాఠశాలను గురువారం ఉదయం శ్రీకాకుళం ఉప విద్యాశాఖాధికారి పగడాల అమ్మ ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా ఆమె పాఠశాల రికార్డులను, ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు పట్టికను తనిఖీ చేశారు.

అనంతరం పాఠశాల తాత్కాలిక ప్రధాన ఉపాధ్యాయురాలు పి. సత్యవతితో సమీక్ష నిర్వహించారు. పదో తరగతి విద్యార్థులను పాఠ్యాంశాల్లో ప్రశ్నలను అడిగారు. విద్యార్థులు ఆమె అడిగిన ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పారు. 10 తరగతి విద్యార్థులకు భవిష్యత్తులో జరగబోయే ప్రధాన పరీక్షల విషయంలో అనేక సలహాలు సూచనలు ఆమె ఇచ్చారు. చివరగా అమ్మ వడి కార్యక్రమాన్ని పరిశీలించారు.

పెద్దపాడు పాఠశాల పనితీరుపై ఆమె పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎస్ వి కృష్ణారావు, ఎం శాంతారావు, జి.భూషణ రావు, డి. ఎం .మల్లేశ్వరి, కె.సురేష్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయుడు గుండబాల మోహన్, క్రాఫ్ట్ బి. త్రివేణి, ఆర్ట్ .సి.హెచ్. రవి కుమార్ కూడా పాల్గొన్నారు.

Related posts

వయోవృద్ధులకు ఉపయోగపడే న్యాయసహాయ పుస్తకావిష్కరణ

Satyam NEWS

మీ కోసమే చెబుతున్నాం తల్లీ…కరోన మహమ్మారితో జాగ్రత్త

Satyam NEWS

సిసి రోడ్డు శంకుస్థాపనకు ముఖ్యఅతిథిగా శానంపూడి

Satyam NEWS

Leave a Comment