41.2 C
Hyderabad
May 4, 2024 16: 03 PM
Slider విజయనగరం

రాజీవ్ స్టేడియంలో అధికారులు వ‌ర్సెస్ ఉద్యోగుల మ‌ధ్య పోటీలు

#vijayanagaram

ఉత్సాహంగా  హుషారుగా విజయనగరం జే.సీ కిషోర్..ఆర్డీఓ భ‌వానీ శంక‌ర్

ఏపీలోని సంపూర్ణంగా 34  మండ‌లాల‌తో ఉన్న విజ‌య‌న‌గ‌రం జిల్లా కాస్త మరి కొద్ది రోజుల్లో  రెండు జిల్లాలుగా విడిపోనున్నాయి. ఉద్యోగుల్లో అప్పుడే మ‌నం విడిపోతున్నామ‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది కూడ‌.అయితే జిల్లాకు ఆరు నెల‌ల క్రితం కొత్త‌గా వ‌చ్చిన క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారీ…ఉద్యోగుల్లో ఆ భావ‌న‌ను గుర్తించి…జిల్లాకుచెందిన ప్ర‌జాప్ర‌తినిధుల‌తో మాట్లాడి. చివ‌రి సారిగా  అధికారులు, ఉద్యోగుల మ‌ధ్య ఆట‌ల పోటీల‌ను నిర్వ‌హించల‌ను కోవ‌డం అందుకు శ్రీకారం చుట్టడం జరిగింది.

అందలో బాగంగా…స్ధానిక రాజీవ్ స్టేడియంలో ఉత్సాహ భరితంగా ప్రారంభమైన జిల్లా అధికారులు, ఉద్యోగుల రెండు రోజుల క్రీడా పోటీలు.  మ‌హాగ‌ణ‌ప‌తి భ‌జం, క్రీడా జ్యోతి..నేష‌ల‌న్ ఫ్యాగ్ ల ప్రారంభోత్స‌వం జ‌రిగాయి.ఈ  కార్యక్రమంలోజిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్  సూర్యకుమారి, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీ రఘు వర్మ, మేయర్ వి. విజయలక్ష్మి, జాయింట్ కలెక్టర్ డా జి సి కిషోర్ కుమార్, ఐ.టి.డి.ఏ . ప్రాజెక్ట్ అధికారి కూర్మనాథ్, ఆర్డీఓ  భ‌వ‌నా శంక‌ర్…ప‌లు శాఖ‌ల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

జిల్లా విడిపోతున్ననేప‌థ్యంలో చివ‌రి సారిగా క్రీడాలు పోటీలు ప్రారంభం..!

రాష్ట్రంలో కొత్త గా మ‌రో 13 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. గ‌డ‌చిన‌న నెల రోజుల   నుంచీ రాష్ట్రా స్థాయి అధికారులు ఆయా జిల్లాల‌కు రావ‌డం..స్థానికంగా ప‌రిస్థితుల‌ను క్షుణ్ణంగా తెలుసుకుని…సీఎం జ‌గ‌న్ కు అందించ‌డం జ‌రగుతోంది.ఈ క్ర‌మంలోనే జిల్లాను పార్వ‌తీపురంను కేంద్రం చేస్తూ…కొత్త మ‌న్యం జిల్లా ఏర్పాటు అవ్వ‌బోతోంది. ఇటీవ‌ల జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారీ పార్వ‌తీపురం వెళ్లి…అక్క‌డ పరిస్థితిని…ఏయే  శాఖ‌ల‌ను  ఏయే భ‌వ‌నాల‌లో ఏర్పాటుచెయ్యాలో స్వ‌యంగా ప‌రిశీలించారు కూడ‌.

తాజాగా జేడ్పీ చైర్మ‌న్ నోటి వెంట కూడా…కొత్త జిల్లా ఏర్పాటు అంటూ ప్రస్తావ‌న  రానేవ‌చ్చింది. జిల్లా కేంద్రంలోని రాజీవ్ క్రీడా మైదానంలో ఈ మేర‌కు జిల్లా అధికారులు,ఉద్యోగ‌స్తుల మ‌ధ్య క్రీడ‌ల పోటీల‌ను ప్రారంభించిన జేడ్పీ చైర్మ‌న్…త్వ‌ర‌లో కొత్త జిల్లా ఏర్పాటు అవుతుంద‌ని చెప్ప‌క‌నే చెప్పారు. 1979 లో ఏర్ప‌డ్డ విజ‌య‌న‌గరం జిల్లా దాదాపు 42 సంవ‌త్స‌రాలు..ఎంతోమంది పాల‌కుల‌ను…మ‌రెంద‌రో మంది ప్ర‌జాప్ర‌తినిదుల‌తో అబివృద్ది చెందిన జిల్లా మ‌రి కొద్ది రోజుల్లో విడిపొనుంది.

విభ‌జించి పాలించు అన్న‌చందంలో వికేంద్రీక‌ర‌ణ ముఖ్య‌మ‌ని  భావించిన త‌రుణంలో చివ‌రి సారిగా  జిల్లా స్థాయి అధికారులు,ఉద్యోగ‌స్తులు…క‌లిసి  ఈ క్రీడ‌ల‌లో పాల్గొన్న‌డం ఎంత ఆనంద‌దాయ‌క‌మ‌న్నారు. ఈ క్రీడ‌ల‌లో పాల్గొని..ప్ర‌తిభా పాట‌వాలు క‌న్నా…క‌లిసి మెలిసి క్రీడ‌లలో పాల్గొన‌డం…ఓ స‌మిష్టికృషికి నిద‌ర్శ‌మ‌ని జేడ్పీ చైర్మ‌న్ అన్నారు.అనంత‌రం.. జే.సీ కిషోర్ కుమార్ తెచ్చిన  క్రీడాజ్యోతిని…వెలిగిస్తూ పోటీల‌ను ప్రారంభించారు.

Related posts

మల్లాపూర్ డివిజన్ లో సీసీ కెమెరాల ఏర్పాటు

Satyam NEWS

కార్మికులను బానిసత్వం లోనికి నెట్టడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది

Satyam NEWS

మీడియా క్రియేషన్ : నేనా సి.ఎమ్మా ఎపుడు ఏకడా

Satyam NEWS

Leave a Comment