38.2 C
Hyderabad
May 5, 2024 19: 43 PM
Slider క్రీడలు

క్రీడారంగంలో ప్రభుత్వ సదుపాయాలు ఉపయోగించుకోవాలి

#sporta

క్రీడాపరంగా ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానానికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. వైరా పట్టణం ఇండోర్ స్టేడియంలో రూ. 112 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ తో కలిసి కలెక్టర్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గ కేంద్రాల్లో మినీ స్టేడియంలు నిర్మించి, క్రీడలకు ప్రాముఖ్యత ఇస్తుందని అన్నారు. వైరా మినీ స్టేడియంలో అధునాతన అంతర్జాతీయ ప్రమాణాలతో టెన్నిస్ కోర్ట్, బాల్ బ్యాడ్మింటన్ కోర్టులు రెండు, ఓపెన్ జిమ్ తదితర నిర్మాణాలు చేపట్టామన్నారు.

సదుపాయాలు ఏర్పాటు ఒక ఎత్తైతే, వాటిని వాడుకొని, ఎదగడం ఒక ఎత్తని ఆయన అన్నారు. జనాభా అతితక్కువగా ఉన్న చిన్న చిన్న దేశాల నుండి అంతర్జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన ఉసేన్ బోల్ట్, రోజర్ ఫెదరర్ లాంటి వాళ్ళు పుట్టుకొస్తున్నారని, మన దేశంలో ఎంతోమంది ఉన్న, సదుపాయాలు, ప్రోత్సాహం లేక వెలుగులోకి రావడం లేదని ఆయన తెలిపారు. విద్యా, క్రీడా శాఖలు సమన్వయం తో పనిచేసి, పిల్లల్లో ఉన్న సామర్థ్యాన్ని వెలుగులోకి తేవాలని, వారిని ప్రోత్సహించి రాణించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ మాట్లాడుతూ, ఇష్టమైన రంగాన్ని ఎంచుకొని ఆ రంగంలో రాణించాలన్నారు. క్రీడల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు ఉపయోగించుకొని శారీరకంగా,మానసికంగా దృడంగా తయారవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సునీల్ రెడ్డి, వైరా మునిసిపల్ కమీషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ శ్రీనివాసరావు, వైరా ఎంపిపి వేల్పుల పావని, జెడ్పిటిసి నంబూరి కనకదుర్గ, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జర్నలిస్టుల సంక్షేమానికై కలెక్టరేట్ వద్ద నిరసన

Satyam NEWS

హైదరాబాద్ అపోలోకు మంత్రి వెల్లంపల్లి తరలింపు

Satyam NEWS

తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం 

Satyam NEWS

Leave a Comment