31.7 C
Hyderabad
May 6, 2024 23: 12 PM
Slider ఖమ్మం

లాభదాయకమైన యూనిట్ల ద్వారా ఆర్ధికభివృద్ధి సాధించాలి

#dalitbandhu

దళితులు లాభదాయకమైన యూనిట్లు ఎంచుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ మండలం కొడవటిమెట్ట గ్రామంలో పర్యటించి, దళితబంధు సర్వే తనిఖీ చేశారు. గ్రామంలోని తిరుమలపల్లి జోజి, మేకల రవికుమార్ ల ఇండ్లకు వెళ్లి వారితో ఇంటరాక్ట్ అయ్యారు. ఏమి పనిచేస్తున్నది, ఏ యూనిట్ గురించి ఆలోచిస్తుంది అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం దళితులు ఆర్థికంగా ఎదిగి, తమ కాళ్ళ మీద తాము నిలబడడమే కాక, మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి చేరాలన్నారు. లబ్ధిదారులకు కావాల్సిన ధ్రువీకరణలు ప్రత్యేక మీ సేవ కేంద్రాలు ఏర్పాటుచేసి అందజేస్తామన్నారు. మనం ఏ వృత్తిలో వున్నాం, ఏ వృత్తిలో నైపుణ్యం ఉంది, ఏ యూనిట్ అయితే మన కుటుంబ సభ్యులే నిర్వహించుకోగల్గుతాం, ఏ యూనిట్లకు డిమాండ్ ఉంది అనే ఆలోచన చేయాలన్నారు. కాలనీల్లో, వీధుల్లో దళితబంధు యూనిట్లపై చర్చ జరగాలన్నారు.

Related posts

సరి కొత్త కాశ్మీరాన్ని నిర్మిద్దాం కలిసి రండి

Satyam NEWS

హిందుత్వవాదులు నాపై దాడి చేయవచ్చు.. రాహుల్

Sub Editor

కమ్యూనిస్టుల దారెటు ..?

Satyam NEWS

Leave a Comment