30.2 C
Hyderabad
May 13, 2024 14: 27 PM
Slider నెల్లూరు

క్రీడలు జీవితాంతం ఆరోగ్యాన్ని ఇస్తాయి

#MP Adala Prabhakar Reddy

క్రీడలు జీవితాంతం ఆరోగ్యాన్ని ఇస్తాయని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. సౌత్ మోపూరులో శనివారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ స్థాయి గ్రిగ్ మెమోరియల్ను జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మతో కలిసి ప్రారంభించారు.

చదువుతోపాటు క్రీడలు కూడా ముఖ్యమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. క్రీడల్లో పాల్గొన్నవారు ఆరోగ్యవంతంగా ఉంటారని, అందుకు తాను కూడా ఒక ఉదాహరణ అని చెప్పారు. తాను చదువుకునే రోజుల్లో క్రీడల్లో ఆసక్తి చూపే వాడినని, జిల్లా,రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు.

వారంలో కనీసం 4 రోజులు వ్యాయామం అవసరమని, విద్యార్థులు దానిని పాటించాలని హితవు పలికారు. గ్రిగ్ మెమోరియల్ లో పాల్గొనడానికి వచ్చిన విద్యార్థులు మార్చి ఫాస్ట్ను నిర్వహించారు. క్రీడాజ్యోతిని వెలిగించి క్రీడా ఉత్సవ ప్రారంభ ప్రకటన చేశారు. ఆ తర్వాత గ్రామ సచివాలయాన్ని పరిశీలించి వాలంటీర్లతో కాసేపు మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. డిసిసిబి మాజీ చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, జడ్పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి, స్థానిక నేత పముజల దశరథ రామయ్య, రూరల్ ఎంపీపీ విజయ్ కుమార్, వైస్ ఎంపీపీ రవీందర్ రెడ్డి,

కార్పొరేటర్లు అవినాష్, నూనె మల్లికార్జున యాదవ్, వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ సురేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, కోటేశ్వర్ రెడ్డి స్థానిక ఎంపిటిసిలు, సర్పంచులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

వంద శాతం గర్భిణీ స్త్రీల నమోదు

Murali Krishna

సేఫ్ సైడ్: విశాఖకు కోవిడ్ 19 ప్రమాదం లేదు

Satyam NEWS

ఏపిలో ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇది

Satyam NEWS

Leave a Comment