32.2 C
Hyderabad
May 2, 2024 02: 22 AM
Slider విశాఖపట్నం

సేఫ్ సైడ్: విశాఖకు కోవిడ్ 19 ప్రమాదం లేదు

port trust

విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ ఆధ్వర్యంలో కోవి డ్ 19 కు సంబంధించి అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని పోర్టు యాజమాన్యం స్పష్టం చేసింది. కోవిడ్ 19 పై ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి అప్రమత్తంగా ఉన్నట్లు పోర్టు యాజమాన్యం స్పష్టం చేసింది.

చైనా నుంచి fortune friend అనే నౌక పోర్టు కు వచ్చిందని అందులో 22 మంది సిబ్బంది ఉన్నారని పోర్టు అధికారులు వెల్లడించారు. వీరిలో 17మంది చైనా, 5మంది బర్మా దేశస్తులు ఉన్నారు. అయితే నౌకలో ఉన్న సిబ్బందిని పూర్తిగా పరీక్షించిన తరువాతే కార్యకలాపాలకు అనుమతిస్తామని పోర్టు యాజమాన్యం తెలిపింది.

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సూచించిన అన్ని జాగ్రత చర్యలు చేపడుతున్నట్లు పోర్టు అధికారులు తెలిపారు. కరోనా కు సంబంధించి పోర్టు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని సిబ్బందికి n 95 మాస్క్ లు ,గ్లౌజ్ లు,హ్యాండ్ శానిటైజర్స్, ఒకసారి ఉపయోగించే గ్లౌజ్స్, థార్మో ఫ్లాష్ హ్యాండ్ గన్ లతో పాటు అన్ని రక్షణ పరికరాలను అందుబాటులో ఉంచామని పోర్టు అధికారులు తెలిపారు.

ఏదైనా షిప్ వచ్చిన వెంటనే పోర్టు ఆరోగ్య అధికారి షిప్ లోకి వెళ్లి సిబ్బంది అందరికీ పరీక్షలు నిర్వహిస్తారు. పైలట్ లు మూడు అరలు కలిగిన N 95 మాస్క్ లు ధరించి మాత్రమే షిప్ లోకి వెళ్ళాలి.  షిప్ లకు సంబంధించిన కార్యకలాపాలతో సంబంధం ఉన్న పోర్టు సిబ్బంది అంతా కచ్చితంగా మాస్క్ లు, హ్యాండ్ గ్లౌస్ లు వినియోగించాలి.  కోవిడ్ 19 కు సంబంధించి షిప్ సిబ్బంది అందరికీ పరీక్షలు నిర్వహిస్తారు. పోర్టు అధికారులు షిప్ ల పైకి వెళ్లి రావడాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించే ప్రయత్నం. షిప్ లోకి వెళ్ళే సిబ్బంది వైరస్ నివారణ చర్యలను కచ్చితంగా పాటించాలి. కోవిడ్ 19 కి సంబంధించి అన్ని అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు పోర్టు యాజమాన్యం తెలిపింది. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు.

Related posts

సీఎం జగన్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS

ఏపీ పోలీసులు అదుపులో తెలంగాణ వాసి…!

Satyam NEWS

కెసిఆర్ మనవనికి రేషన్ బియ్యం పెడతారా..?

Satyam NEWS

Leave a Comment