29.7 C
Hyderabad
May 6, 2024 05: 29 AM
Slider ప్రత్యేకం

కుక్కల దాడిలో అరుదైన చుక్కల జింక మృతి

#spotteddeer

అరుదైన చుక్కల జింక మరణించి కనిపించడంతో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ రేంజ్ ఫారెస్టులో కలకలం రేగింది. సోమశిల అటవీ ప్రాంతంలోని సోమశిల గ్రామం ప్రాంతంలో గురువారంనాడు చుక్కల జింక ఒకటి నిర్జీవంగా కనిపించింది. అరుదైన చుక్కల జింకను ఎవరైనా వేటగాళ్లు హతమార్చారా అనే అనుమానంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. అయితే అడవి కుక్కల దాడికి చుక్కల జింక మరణించినట్లు ప్రాధమిక దర్యాప్తులో అటవీ శాఖ అధికారులకు తెలిసింది. వెంటనే ఆ జింక మృతదేహాన్ని కొల్లాపూర్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ వద్దు తీసుకుకవెళ్లి పోస్టు మార్టం నిర్వహించినట్లు కొల్లాపూర్ ఫారెస్టు రేంజర్ శరత్ చంద్రారెడ్డి తెలిపారు. పోస్టు మార్టం చేసిన తర్వాత ఆ జింక కుక్కల దాడిలోనే మరణించినట్లు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నిర్ధారించినట్లు ఆయన వెల్లడించారు. దాంతో జింక మృతదేహాన్ని అటవి ప్రాంతంలో పాతిపెట్టినట్లు ఆయన తెలిపారు. వన్యప్రాణులను కాపాడేందుకు అందరూ సహకరించాలని తద్వారా అడవులను కాపాడుకోవచ్చునని కొల్లాపూర్ ఫారెస్టు రేంజర్ శరత్ చంద్రారెడ్డి కోరారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటిన కేకే

Satyam NEWS

విద్యార్థులకు నోటు పుస్తకాల వితరణ

Satyam NEWS

కేంద్రమా నీకెందుకు ఇంత ఉలికిపాటు?

Satyam NEWS

Leave a Comment