37.2 C
Hyderabad
May 6, 2024 19: 20 PM
Slider శ్రీకాకుళం

అమరావతి ఉద్యమాన్ని అరెస్టులతో ఆపలేరు

srikakulam tdp

అమరావతి పరిరక్షణ కమిటీ బస్సు యాత్ర కు సంఘీభావం తెలపడానికి  వెళ్లిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును రాత్రి విజయవాడ లో వైసిపి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ శ్రీకాకుళంలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.

స్థానిక 7 రోడ్స్ జంక్షన్ లో శ్రీకాకుళం టీడీపి ఇంచార్జి గుండ లక్ష్మీదేవి ఆధ్వర్యం లో కొవ్వొత్తుల ర్యాలీ, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పార్లమెంట్ సభ్యుడు కింజరాపు రామ్మోహన్నాయుడు, మాజీ విప్ కూన రవికుమార్ పాల్గొన్నారు. అమరావతి కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల  పోరాటాన్ని  అణగదొక్కాలని వైసిపి ప్రభుత్వం  చూస్తున్నదని వారన్నారు. 

ప్రజలకు, రైతులకు మద్దతుగా సంఘీభావం తెలుపుతున్న చంద్రబాబునాయుడును అరెస్టు చేయడం అన్యాయమని వారన్నారు. అరచేత్తో  సూర్యకాంతి ని ఎలా ఆపలేమో , 13 జిల్లా ల ప్రజామద్దతు  తో ప్రారంభమైన  అమరావతి ఉద్యమాన్ని కూడా ప్రభుత్వం ఆపలేదని వారు తెలిపారు. ఈ కార్యక్రమం లో మాజీ టీడీపీ జిల్లా అధ్యక్షులు చౌదరి బాబ్జి,  జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి మొదలవలస  రమేష్ పాల్గొన్నారు.

ఇంకా నగర టీడీపీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గుమ్మా నాగరాజు, మాజీ లిడ్క్యాప్ డైరెక్టర్ రమణమాదిగ, జిల్లా  టీడీపీBC సెల్  అధ్యక్షులు పాండ్రంకి శంకర్,  జిల్లా టీడీపీ నాయకులు కొర్నుప్రతాప్,   టీడీపీజిల్లా మహిళాఅధ్యక్షురాలు మెట్ట సుజాత, గార మండల పార్టీ టీడీపీ అధ్యక్షులు గొండు వెంకటరమణమూర్తి కార్యక్రమానికి హాజరయ్యారు.

అదే విధంగా టీడీపీ డివిజన్ ఇన్చార్జిస్ కెల్ల కొండబాబు, కవ్వాడి సుశీల, కరగాన భాస్కరరావు, కరగాన రామ్మోహన్ యాదవ్, తాళ్లూరి నవీన్,గుమ్మా రఘురామ్,  బస్వా రాజేష్ రెడ్డి, రోణంకి కళ్యాణ్ , పట్నాయుకుని  సతీష్ బాబా, కోటేశ్వర కోవెల అధ్యక్షులు వాళ్ల కిరణ్ కార్యక్రమానికి హాజరయ్యారు.

అలాగే అబ్దుల్ షాజహాన్,(సాతు), బహుదూర్ బాషా, మెట్ట నాగరాజు చౌదరి అవినాష్, మెండ దాస్ నాయుడు, దుంగ భాస్కర్ ,సంతోష్  ధనరాజ్, షణ్ముఖ, సతీష్, ధను బాద్షా, తారక్  దారపు సాయి కుమార్ రాఘవ, రామసేన యువత, పార్టీ క్యాడర్ పాల్గొన్నారు.

Related posts

Analysis: ఐదు రాష్ట్రాలూ మారనున్న జాతకాలు

Satyam NEWS

శబరిమలకు పోటెత్తిన భక్తులు

Murali Krishna

కన్నడ సంచలనం “తారకాసుర” తెలుగులో!!

Satyam NEWS

Leave a Comment