38.2 C
Hyderabad
May 3, 2024 21: 37 PM
Slider ఆధ్యాత్మికం

న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం కార‌ణంగా శ్రీ‌వారి ఆల‌య మూత

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం కార‌ణంగా 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూసివేస్తారు. బ్రేక్ ద‌ర్శనం, శ్రీ‌వాణి, రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, ఇత‌ర ఆర్జిత సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. గ్రహణం కారణంగా నవంబరు 8వ తేదీ తిరుప‌తిలో జారీ చేసే ఎస్ఎస్‌డి టోకెన్లు రద్దు చేశారు. గ్రహణ సమయం ముగిసిన తర్వాత వైకుంఠం -2 నుండి మాత్రమే భ‌క్తుల‌ను అనుమ‌తిస్తారు. న‌వంబ‌రు 8న మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 2.39 గంట‌ల నుండి సాయంత్రం 6.27 గంట‌ల వ‌ర‌కు చంద్ర‌గ్రహణం ఉంటుంది. ఈ కార‌ణంగా ఉద‌యం 8.40 నుండి రాత్రి 7.20 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు.

సాధారణంగా గ్రహణం రోజుల్లో గ్రహణం తొల‌గిపోయే వరకు వంట చేయరు. తిరుమ‌ల‌లోని మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇత‌ర ప్రాంతాల్లో కూడా అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ ఉండ‌దు. తిరిగి రాత్రి 8.30 గంటల నుండి భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభమవుతుంది. కావున‌ భ‌క్తులు ఈ విషయాన్ని గమనించి, అసౌకర్యానికి గురికాకుండా త‌మ తిరుమల యాత్రను తదనుగుణంగా రూపొందించుకోవాల‌ని టీటీడీ మ‌రోసారి విజ్ఞప్తి చేస్తోంది.

Related posts

కరోనా కట్టడిలో వై ఎస్ జగన్ ప్రభుత్వ వైఫల్యo

Satyam NEWS

యువతకు ఆదర్శం స్వామి వివేకానంద

Satyam NEWS

మన రాజ్యాంగాన్ని పౌరులు అందరు గౌరవించాలి

Satyam NEWS

Leave a Comment