40.2 C
Hyderabad
May 6, 2024 16: 20 PM
Slider గుంటూరు

వడ్డెర కులస్తులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి

# Masonry workers

గుంటూరు జిల్లా నరసరావుపేట నియూజకవర్గం  ఇస్సాపాలెం పంచాయితీ పరిధిలోని శ్రీనివాస వెంచర్ లో ఆదివారం అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ, 13 జిల్లాల ప్రతినిధుల సమీక్ష సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వల్లెపు నాగేశ్వరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని 40 లక్షల మంది వడ్డెర కులస్తులు జీవిస్తున్నారని కోవిడ్ 19 కారణంగా వడ్డెర సామాజిక వర్గానికి పనులు లేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. వైస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రతి వడ్డెర కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో వడ్డెర్లకు ఒక ఎమ్మెల్సీ, వడ్డెర కార్పొరేషన్ ఇస్తామని చెప్పారని, అలాగే మైనింగ్ కార్పొరేషన్, వడ్డెర కార్పొరేషన్ కు వెయ్యి కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి వడ్డెర కులస్తులను ఆదుకోవాలని తెలిపారు.

రాబోవు శాసనసభ సమావేశాలలో వడ్డెరలను ఎస్టీ జాబితాల్లో చేర్చి శాసన సభ లో బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వనికి నివేదిక పంపాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు పుల్లారావు, రాష్ట్ర మహిళ అధ్యక్షరాలు వేముల శివ పార్వతి, జిల్లా అధ్యక్షులు పల్లపు మహేష్ బాబు, జిల్లా యూవజన అధ్యక్షులు ఇర్ల శివరామ కృష్ణ, తన్నీరు అంకమ్మరావు,తన్నీరు శ్రీను, పిట్ల కొటేశ్వరవు,బత్తుల బ్రమ్మం పాల్గొన్నారు.

గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు గా బత్తుల అంకమ్మ రాజుకు నియామక పత్రం అందజేశారు. కరోనా వైరస్ కారణంగా పరిమిత సభ్యులు హాజరయ్యారని, కరోనా విపత్తు తగ్గిన తరువాత తమ కార్యాచరణ ఉదృతం చేస్తామని తెలిపారు.

Related posts

పండుగ వేళ గుండె పోటుతో జర్నలిస్టు సూరేపల్లె మృతి

Satyam NEWS

గాంధీభవన్ ను ముట్టడించిన భజరంగ్ దళ్

Satyam NEWS

కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు

Satyam NEWS

Leave a Comment