26.7 C
Hyderabad
April 27, 2024 07: 42 AM
Slider ముఖ్యంశాలు

మేడి పట్టిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

#SubRegistrar

ఆమె ఓ ఉన్నతమైన అధికారిని,అయితేనేం…. బురద పని చేస్తూ అన్నదాతల్లో స్ఫూర్తి నింపడానికి  కూలీగా మారారు, ఆమె ఎవరో కాదు ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్, ఎప్పటి లాగే ములుగు జిల్లా జాకారం గ్రామంలో సొల్లేటి మహిపాల్ రెడ్డికి చెందిన వరి పొలంలో హాలం పట్టి బురద దుక్కిదున్ని, నాటు వేశారు.

 మధ్యాహ్నం కూలీలతో కలిసి అన్నం తిన్నారు, రోజంతా కూలీ పని చేసినందుకు గాను 300 కూలీ డబ్బులు తీసుకున్నారు.

తస్లీమా మాట్లాడుతూ ఈ మానవ జాతిని నడిపించే యంత్రం రైతన్న అని, రైతు వ్యవసాయానికి దూరమైతే మానవ మనుగడే కనుమరుగవుతుందని, ఇలాంటి తరుణంలో మీము ఉన్నాం అనే భరోసా కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అండగా నిలవాలని, రైతులతోనే దేశం సుభిక్షంగా ఉంటుందని తస్లీమా  అన్నారు.

దేశానికి అన్నం పెట్టే రైతన్న పడే కష్టం తనకు తెలుసునని, మనకు అన్నం పెట్టడం కోసం ఎండనక వానానక, ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక,పెట్టిన పెట్టుబడి రాక రైతులు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారని, వ్యవసాయమే దండగా అని చాలా మంది రైతులు వ్యవసాయానికి  దూరం అవుతున్నారని అని తెలిపారు.

అలా అని రైతులు వ్యవసాయానికి దూరం అయితే మానవ మనుగడే కనుమరుగు అవుతుందని, అలా కాకూడదు అంటే రైతులకు భరోసా కల్పించాలని కోరారు. రైతు బాగుంటేనే దేశం  బాగుంటుందని ఆమె తెలిపారు. కరోనా ప్రభావంతో కూలీలు దొరకడం లేదని, దొరికిన వారికి ఇవ్వడనికి డబ్బులు లేని పరిస్థితి అని ఇలాంటి తరుణంలో యువతి,యువకులు తల్లిదండ్రులు చేసే పనిలో వారికి సహకరించాలని తెలిపారు.

Related posts

మసీదుల్లో నిలిచిపోయిన సామూహిక ప్రార్ధనలు

Satyam NEWS

షర్మిల అరెస్టు పై భిన్నాభిప్రాయాలు

Satyam NEWS

తక్షణమే చెరువులు నింపాలి: ఏపి సిఎం ఆదేశం

Satyam NEWS

Leave a Comment