34.2 C
Hyderabad
May 13, 2024 18: 43 PM
Slider నిజామాబాద్

అక్రమ రిజిస్ట్రేషన్లు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు: కామారెడ్డి సబ్ రిజిస్ట్రార్ శ్రీలత

#srilatha

అక్రమ రిజిస్ట్రేషన్లు చేయాలని కొందరు తనపై ఒత్తిడి చేస్తున్నారని, చేయకపోవడంతో తనపై ఆరోపణలు చేస్తున్నారని కామారెడ్డి సబ్ రిజిస్ట్రార్ శ్రీలత తెలిపారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబోద్దీన్ మీడియా సమావేశం అనంతరం సాయంత్రం ఆమె ఒక ప్రకటన విడుదల చేసారు. ఆమె మాట్లాడుతూ.. కామారెడ్డి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనల మేరకే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడుతున్నామని తెలిపారు. తెలంగాణ స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ యాక్ట్ నియమాలను అనుసరించి రిజిస్ట్రేషన్లు నిర్వహించడం జరుగుతుందన్నారు.  రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ఫీజులు వసూళ్లు చేస్తున్నామని, ఎలాంటి రుసుము అదనంగా వసూళ్లు చేయడం లేదని తెలిపారు. కొంతమంది వ్యక్తులు అక్రమ రిజిస్ట్రేషన్లు చేయాలని తమపై ఒత్తిడి తీసుక వచ్చి ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. తాను ఎలాంటి తప్పులు చేయలేదని, తమపై ద్రుష్పచారాం చేయవద్దని కోరారు. విఎల్టీ చార్జీలు మున్సిపల్ అధికారులు మాత్రమే వసూళ్లు చేస్తారని తెలిపారు. నియమ నిబంధనలకు అనుగుణంగా చేస్తుంటే కొంతమంది తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఎవరి మాయ మాటలు ప్రజలు నమ్మవద్దని, నేరుగా కార్యాలయంలో తమ రిజిస్ట్రేషన్లు సాఫీగా చేసుకోవాలని సూచించారు.

Related posts

సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు: ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

Satyam NEWS

కాంట్రవర్సీ: అర్చకుల లెక్కలు గోవిందార్పణం

Satyam NEWS

దరఖాస్తుల పరిశీలన వేగంగా చేయాలి

Bhavani

Leave a Comment