37.2 C
Hyderabad
May 6, 2024 12: 56 PM
Slider కరీంనగర్

నా రక్తం దారబోసి మీకు సేవ చేస్తా…

#gangula

నన్ను నమ్మి మూడు సార్లు గెలిపించిన కరీంనగర్ నియోజకవర్గ ప్రజల గొంతుకను అయ్యానని మరోసారి ఆశీర్వదిస్తే మీలోనే ఉంటానని..మీతోనే ఉంటానని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కొత్తపల్లి మండలంలోని చింతకుంట గ్రామంలో యువకులతో ఏర్పాటు చేసిన సమావేశానికి, కరీంనగర్ రూరల్ మండలంలోని గోపాల్ పూర్ లో చేరికల కార్యక్రమానికి మంత్రి గంగుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలంలోని యువకులు, ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు.

మంత్రి గంగుల కండువా కప్పి బీ ఆర్ ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమైక్య పాలనలో పల్లెలు నీళ్ళు లేక అన్నదాతలు అరిగొసలు పడిన పరిస్థితి నుండి నేడు స్వయం పాలనలో కాళేశ్వరం జలాలతో పల్లెలు జలకళ సంతరించుకున్నాయి అని, కోట్ల రూపాయల అభివృద్ధితో గ్రామాల రూపురేఖలు మార్చామని అన్నారు. నన్ను నమ్మి మూడు సార్లు గెలిపించిన కరీంనగర్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయవద్దని సీఎం కెసిఆర్ గారి నుండి వందల కోట్ల రూపాయల నిధులను తెచ్చి అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు. ఆనాడు గ్రామాల్లోకి రావాలంటే రోడ్లు లేక ఇబ్బందులు పడ్డ పరిస్థితి నుండి నేడు కోట్ల రూపాయలతో అధ్బుతంగా రహదారుల నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు.

60 రోజులు నాకోసం కష్టపడితే 5 సంవత్సరాలు మీ కోసం కష్టపడతానని అన్నారు. కెసిఆర్ లేని తెలంగాణ ను ఊహిచుకొలేమని,,నా చేతులను బలోపేతం చేస్తే..నా రక్తం దారబోసి అయినా మీకు సేవ చేస్తానని స్పష్టం చేశారు. నాకు అభివృద్ధి తప్ప మరో ఆలోచన లేదని, మీ భవిష్యత్ బాధ్యత తనదేనని అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ను కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉందని, బీజేపీ, కాంగ్రెస్ నాయకుల రూపంలో మళ్ళీ ఆంధ్రా నాయకులు వస్తున్నారని, కెసిఆర్ ఓడిపోతే తెలంగాణ ను మళ్ళీ ఆంధ్రలో కలిపే ప్రయత్నం చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ సంపదను చూసి ఆంధ్ర నాయకుల కళ్ళ మంట ప్రారంభం అయిందని, మరోసారి మన సంపదను దోచుకునేందుకు వస్తున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

మన బిడ్డల భవిష్యత్ బాగుండాలంటే కెసిఆర్ చేతులను బలోపేతం చేయాలని అన్నారు. తమతో పాటు తమ కుటుంబ సభ్యులు రానున్న ఎన్నికల్లో మంత్రి గంగుల కమలాకర్ కు మూకుమ్మడిగా ఓట్లు వేస్తామని తీర్మానం చేస్తూ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డ వేణి మధు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, జడ్పీటీసీ పిట్టల కరుణ – రవీందర్, ఎంపిపి పిల్లి శ్రీలత మహేష్, రూరల్ ఎంపిపి తిప్పర్తి లక్ష్మయ్య, పార్టీ అధ్యక్షుడు పెండ్యాల శ్యామ్ సుందర్ రెడ్డి,ఏఎంసీ వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్,నాయకులు సుంకిషాల సంపత్ రావు,  గంగాధర చందు తదితరులు పాల్గొన్నారు.

Related posts

యాక్షన్:క్షమాపణా సస్పెన్షనా? హెగ్డేఫై బీజేపీ నిర్ణయం

Satyam NEWS

9 మంది విజయనగరం పోలీసులకు ఆత్మీయ వీడ్కోలు

Satyam NEWS

ఏకాగ్రతతో చదివి ఉన్నతంగా ఎదగాలి

Bhavani

Leave a Comment