36.2 C
Hyderabad
May 8, 2024 17: 57 PM
Slider నిజామాబాద్

వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అడ్డుకునేవారిపై కఠిన చర్యలు

#kamareddydist

ఆరోగ్య శాఖకు చెందిన మహిళా ఉద్యోగస్తులు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా కోవిడ్ నివారణ టీకాలు ఇవ్వడానికి వచ్చినప్పుడు వారిపట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తించి దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవని తహసిల్దార్ ఆనంద్ కుమార్ హెచ్చరించారు. బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఆరోగ్య సిబ్బందితో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ సెక్రెటరీలతో కలిసి టీకాల కార్యక్రమం నిర్వహించాలని, ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకునే విధంగా అవగాహన కల్పిస్తూ 100 శాతం టీకాల లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. అనంతరం ఎస్ ఐ సత్యనారాయణ మాట్లాడుతూ మహిళా ఉద్యోగుల పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తించిన, దాడులకు పాల్పడ్డ వెంటనే 100 డైల్ కు లేదా పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని వెంటనే వారిని అదుపులోకి తీసుకొని శిక్షించ బడతారని అన్నారు. మహిళా చట్టాల పై ఉద్యోగస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య బోధకులు దస్తీ రామ్, ఇంతియాజ్ అలీ, మహిళా ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.

జి.లాలయ్య  సత్యం న్యూస్ రిపోర్టర్ జుక్కల్ నియోజకవర్గం

Related posts

ప్రజాసమస్యలే ప్రధాన ఎజెండాగా గుజరాత్ ఎన్నికలు

Bhavani

ఇంద్రకీలాద్రిపై వచ్చే నెల 17 నుంచి దసరా ఉత్సవాలు

Satyam NEWS

ఉరే సరి: పూణెలో ఉగాండా మహిళపై గ్యాంగ్ రేప్

Satyam NEWS

Leave a Comment