26.7 C
Hyderabad
April 27, 2024 10: 07 AM
Slider నల్గొండ

తెలంగాణలో రైతులకు న్యాయం చేయాలని తెలుగుదేశం ఆధ్వర్యంలో ర్యాలీ

#hujurnagarTDP

రైతులకు మనోధైర్యం కల్పించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హుజూర్ నగర్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎన్టీఆర్ సెంటర్ నుంచి ఆర్డిఓ కార్యాలయం వరకు సోమవారం ప్రదర్శన నిర్వహించారు.

అనంతరం ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ,రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని,తేమ పేరుతో రైతులను మోసం చేస్తున్న వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, యాసంగిలో వరి ధాన్యం వేసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.పండించిన పంటకు బోనస్ కూడా ఇవ్వాలని,పోడు భూములకు తక్షణమే పట్టాలు ఇవ్వాలని,ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేశారు.అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ కు అందచేశారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మండవ వెంకటేశ్వర్లు,తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్ కే అలీ,తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు మాలోతు నాగు నాయక్, నేలపట్ల అంజయ్య గౌడ్,కేసరి నాగయ్య ముదిరాజ్,మేకల రామారావు యాదవ్ , తెలుగు యువత పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చల్ల వంశీ,ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మీసాల సైదులు, గరిడేపల్లి మండల ప్రధాన కార్యదర్శులు పోలాగాని సురేష్ గౌడ్,పాతకోటి లింగారెడ్డి,ఎస్సీ సెల్ పార్లమెంట్ నాయకులు కనక రత్నం,తెలుగు రైతు పార్లమెంటు నాయకులు ఎర్రగాని సైదులు గౌడ్,తెలుగు యువత జిల్లా నాయకులు  యల్లావుల ఉపేందర్ యాదవ్,బీసీ సెల్ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు ఎస్ ఎస్ తారక్,   తెలుగు యువత నాయకులు మధు చౌదరి,రమేష్ నాయక్,జింకల కృష్ణ,  వల్లపుదాసు కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

త్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

మహారాష్ట్ర లో ఎన్కౌంటర్: ఒక మావోయిస్ట్ మృతి

Satyam NEWS

అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన సాఖిబ్ జిల్లాకు గర్వకారణం

Bhavani

మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా

Satyam NEWS

Leave a Comment