41.2 C
Hyderabad
May 4, 2024 16: 47 PM
Slider ఆదిలాబాద్

లాక్ డౌన్ రూల్ : ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలి

nirmal sp 101

కరోనా వైరస్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లలోనే ఉండాలని నిర్మల్ జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రాయధారి, న్యూలింగంపల్లి, కనకపూర్ మరియు రచాపూర్ అదుపులో తీసుకోబడ్డ (కంటైన్ మెంట్ ) గ్రామాలను పర్యటించి ప్రజలు ఎవరూ కూడా బయటకు రావద్దని తమ తమ ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు.

కంటైన్ మెంట్ గ్రామాలలో సోడియం హైపోక్లోరైడ్ ద్రవం గ్రామంలో చల్లించారు. ప్రజలు మూడు అడుగుల సామాజిక దూరం పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించాలని సూచించారు. ప్రజలు ఎవరు కూడా బయటకు రాకుండా చూడాలని, కిరాణం, తదితర దుకాణాలు మూసివేసి కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేయాబడిoదని ఎస్పీ అన్నారు.

ఎస్పీ సొన్/ఖానాపూర్ సిఐలు జీవన్ రెడ్డి, జైరాం నాయక్, ఎస్ఐలు యునుష్,వినయ్ కుమార్, రాజేశేకర్, యపీడీఓ, రెవెన్యూ అధికారులు, సర్పచ్ లు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఉన్న పరువు కాస్తా పోగొట్టుకున్న సుజనా చౌదరి

Satyam NEWS

నీట్, జేఈఈ కోటా స్టడీ మెటీరియల్ సిద్ధం

Satyam NEWS

త్వరలో ట్రైబల్ యూనివర్సిటీకి శంకుస్థాపన….!

Satyam NEWS

Leave a Comment