23.2 C
Hyderabad
May 8, 2024 00: 26 AM
Slider నల్గొండ

అవమాన భారమే విన్నపం ఒక పోరాటం పునః ప్రారంభించడానికి నాంది

#lelavati

తనకు జరిగిన అవమానాలే ‘విన్నపం ఒక పోరాటం’ ప్రారంభించడానికి కారణమని చీకూరి లీలావతి అన్నారు. ఒంటరి మహిళ, వితంతువు అనే పదాలను తొలగించాలని తాను పోరాటం చేస్తున్నానని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లానని ఆమె తెలిపారు.

ఇప్పుడు హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ తాను ఉస్మానియా యూనివ్సిటీలో ఉన్నప్పుడు అవమానించారని లీలావతి అన్నారు. ఆయన చేసిన అవమానం కారణంగానే తనను తాను నిరూపించుకోవాలని అనుకున్నానని ఆమె తెలిపారు.

హైదరాబాదు నగరంలో తాను పోరాటం చేయలేనని, తాను పోరాటం చేయాలంటే  హుజుర్ నగర్ వెళ్లి నిరూపించుకో అప్పుడు ఆలోచిస్తాను, ఇక్కడ ఏం చేయలేవు అంటూ గెల్లు శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారని ఆమె అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ లో టి ఆర్ ఎస్ వి రాష్ట్ర నాయకురాలిగా పని చేసి కేసీఆర్ పై అభిమానంతో ఉన్నానని ఆమె తెలిపారు. సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

2500 కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ

Satyam NEWS

ఆసిఫాబాద్ ఎస్పీని బదిలీ చేయండి: ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

Satyam NEWS

ప్రతి ఒక్కరూ మెచ్చే చిత్రం మాతృదేవోభవ (ఓ అమ్మ కథ)

Satyam NEWS

Leave a Comment