29.7 C
Hyderabad
May 3, 2024 05: 28 AM
Slider మహబూబ్ నగర్

2500 కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ

kalwakurthy 241

కరోనా వ్యాధి దృష్ట్యా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినందున ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  అధ్యక్షుడు జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్  తలకొండపల్లి, హర్యానాయక్ తండా,సూర్యనాయక్ తండా, తుమ్మలకుంట తండా, లక్ష్మీ తండా,సడక్ తండా, కోమటి కుంట తండా, బద్నాపూర్, చిప్పునుంతల, చెన్నారం, చెన్నారం తండా  గ్రామాల్లోని 2500 కుటుంబాలకు రూ.10 లక్షలతో  నిత్యావసర సరకులు, కూరగాయలు ఇంటింటికి తిరుగుతూ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జడ్పిటిసి ఉప్పల్ వెంకటేష్ మాట్లాడుతూ ప్రజలు లాక్ డౌన్లోడ్ సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దృష్టిలో ఉంచుకొని నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కష్టకాలంలో ఉన్న రైతులకు నాలుగో విడత రైతుబంధు డబ్బులను రైతుల అకౌంట్లో జమ చేయాలని ఆయన కోరారు.

ప్రజలకు నేను ఎప్పుడూ బాసటగా ఉంటానని లాక్ డౌన్ ప్రభుత్వం ఇంకా పొడిగించిన కూడా వారికి తన శాయశక్తులా సహాయం అందిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల శ్రీశైలంగౌడ్, ఎస్ఐ సురేష్ యాదవ్ ,vipp శ్రీనివాస్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోపాల్ నాయక్, సర్పంచి లలిత  జోతయ్య, నాయకులు కండె జగత య్య, డా. అఖిల్ తదితరులు పాల్గొన్నారు

Related posts

నెల్లూరు రూరల్లో అభివృద్ధే ప్రతిపక్షాలకు సమాధానం

Bhavani

డ్రోన్ కెమారాలతో పోలీసులు కౌంటింగ్ పర్యవేక్షణ….!

Satyam NEWS

బొమ్మకు క్రియేషన్స్ “ది బాస్ (నెవర్ డైస్)” టైటిల్ లోగో లాంచ్

Satyam NEWS

Leave a Comment