28.7 C
Hyderabad
April 27, 2024 04: 04 AM
Slider విజయనగరం

అహ్లాదకరంగా విజయనగరం..15 కూడళ్లలో సుందరీకరణ పనులు

#ministerbotsa

విజయనగర సుందరీకరణ లో భాగంగా ప్రధాన కూడళ్లను అభివృద్ధి చేసి, విజయనగరం నగరాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామని, రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈమేరకు నగరంలో సాయంత్రం మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో అభివృద్ధి చేసిన గురజాడ సర్కిల్ ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

గురజాడ విగ్రహం చుట్టూ నీటి ఫౌంటెన్లు ఏర్పాటు చేశారు. అలాగే విద్యుత్ కాంతులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. కూడలిలో హైమాస్ట్ లైటింగ్ ఏర్పాటు చేశారు. సుమారు 5.75 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులను నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగం పూర్తి చేసింది.  అభివృద్ధి పరిచిన గురజాడ సర్కిల్ ను ప్రారంభించిన అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, నగర పాలక సంస్థ పాలకవర్గం ఏర్పడిన అనంతరం నగరంలోని 15 ప్రధాన కూడళ్లను అభివృద్ధి చేసేందుకు నిర్ణయించామన్నారు.

ఇందులో భాగంగా గురజాడ సర్కిల్ ను అభివృద్ధి చేసి ప్రారంభించామన్నారు. మిగిలినవి కూడా దశలవారీగా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. నగర అందాలను మరింత ఇనుమడింప చేసే విధంగా రూపుదిద్దుకుంటున్న ప్రధాన కూడళ్లను ప్రజలు వినియోగించి, ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, నగర మేయర్ విజయలక్ష్మి, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కమిషనర్ ఎస్ ఎస్ వర్మ, ఈఈ డాక్టర్ దిలీప్, స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

స్వేచ్ఛాభార‌తికి మ‌రో విజ‌యం

Satyam NEWS

ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి

Satyam NEWS

అక్కినేని జాతీయ పురస్కారాలను అందించిన చిరంజీవి

Satyam NEWS

Leave a Comment